Prapancha Telugu

Latest Telugu News & information portal for Indians & NRI’s  

For more information contact :  info@prapanchatelugu.com

7 కోట్ల భూమి విరాళం

‘భూమి మీద పెట్టుబడి పెడితే ఎప్పటికైనా పెరుగుతుందే తప్ప తగ్గదు’ అంటారు పెద్దలు. అందుకే కాబోలు చిన్న, పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ సెంటు జాగా అయినా కొనుక్కోవాలని చూస్తుంటారు. కానీ, ఓ ప్రవాసురాలు మాత్రం తనకున్న భూమిని విరాళంగా అందించేసింది. ఒకటి కాదు రెండు కాదు రూ.7 కోట్ల విలువ చేసే ఎకరం భూమిని దానం చేసేసింది.
పశ్చిమ గోదావరి జిల్లా నత్తారామేశ్వరానికి చెందిన పడాల కస్తూరి తన కుటుంబంతో కలిసి లండన్‌లో నివాసముంటుంది. సొంతూరికి ఏమైనా చేయాలని నిర్ణయించుకొని.. ఊళ్లో తనకున్న ఎకరం భూమిలో పేదలకు ఇళ్లు కట్టించాలని నిర్ణయించుకుంది. వెంటనే యూకే నుంచి ఏపీకి తిరిగొచ్చి.. ముందుగా ఆంధ్రప్రదేశ్‌ గృహ నిర్మాణ శాఖ చెరుకువాడ శ్రీరంగనాథ రాజును కలిసి తన అభిప్రాయాన్ని వెల్లడించారు. ఈయన పడాల కస్తూరిని జగన్‌ దగ్గరికి తీసుకెళ్లారు. ఏపీ సెక్రటేరియట్‌లో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డిని కలిసి ఎకరం భూమికి సంబంధించిన డాక్యుమెంట్లను విరాళంగా అందజేసింది.
కొడుకు గుర్తుగా..
తన కుమారుడు పడాల కనికిరెడ్డి గుర్తుగా ఈ నిర్ణయం తీసుకున్నానని కస్తూరి తెలిపారు. ఈ స్థలంలో రాష్ట్రంలోని నిరుపేదలకు ఇళ్లు కట్టించాలని కోరారు. కస్తూరి నిర్ణయానికి జగన్‌ అభినందించి.. మంచి కోసం ఈ భూమిని వినియోగిస్తామని తెలిపారు.

Related Posts

Latest News Updates