దేశంలోని 9 ప్రధాన నగరాల్లో ఏడాది కాలంలో గృహాల విక్రయాల్లో 5 శాతం క్షీణత నమోదైంది. 2018 క్యూ4లో 79601 గృహాలు అమ్ముడుపోగా.. 2019 క్యూ4లో 75706 గృహాలు విక్రయమయ్యాయి. వస్తు సేవల పన్ను (జీఎస్టీ)లో మార్పుల వల్లే అమ్మకాల్లో క్షీణత నమోదైందని కంపెనీ సీఓఓ మని రంగరాజన్ తెలిపారు. హైదరాబాద్‌తో పాటూ కోల్కత్తా, ముంబై, పుణె, గుర్గావ్ల్లోనూ గృహాల విక్రయాల్లో వృద్ధి కనిపించింది.
నగరాల వారీగా అమ్మకాలను గమనిస్తే.. అహ్మదాబాద్‌లో 2018 క్యూ4లో 5289 ఇళ్లు విక్రయం కాగా 2019 క్యూ4లో 10 శాతం క్షీణతతో 4739 యూనిట్లకు తగ్గాయి. బెంగళూరులో 10969 యూనిట్ల నుంచి 8402 (23 శాతం క్షీణత)లకు పడిపోయాయి. చెన్నైలో 4819 నుంచి 4197లకు (13 శాతం క్షీణత), నోయిడాలో 7718 నుంచి 3856 యూనిట్లకు (50 శాతం క్షీణత) తగ్గాయి. కోల్‌కత్తాలో 3352 నుంచి 3623లకు (8 శాతం వృద్ధి), ముంబైలో 22904 నుంచి 23718లకు (4 శాతం వృద్ధి), పుణెలో 13712 నుంచి 14348లకు (5 శాతం వృద్ధి), గుర్గావ్లో 5220 నుంచి 5764 యూనిట్లకు (10 శాతం వృద్ధి) పెరిగాయి.
లాంచింగ్స్ డౌన్..
2018 క్యూ4లో దేశంలోని 9 ప్రధాన నగరాల్లో 66019 యూనిట్లు లాంచింగ్స్ కాగా.. 2019 క్యూ4 నాటికి 32 శాతం క్షీణతతో 44834 యూనిట్లకు తగ్గాయి. చెన్నై, గుర్గావ్, పుణె మినహా అన్ని నగరాల్లో క్షీణత నమోదైంది. నగరాల వారీగా గమనిస్తే.. 2018 క్యూ4లో చెన్నైలో 3661 యూనిట్లు ప్రారంభం కాగా.. 2019 క్యూ4 నాటికి 115 శాతం వృద్దికి 7867 యూనిట్లకు పెరిగాయి. గుర్గావ్లో 4705 గృహాల నుంచి 4929 యూనిట్లకు (5 శాతం వృద్ధి), పుణెలో 8695 యూనిట్ల నుంచి 10561 యూనిట్లకు (21 శాతం వృద్ధి) పెరిగాయి. అహ్మదాబాద్‌లో 8122 గృహాల నుంచి 232లకు (97 శాతం క్షీణత), బెంగళూరులో 10964 నుంచి 5026 యూనిట్లకు (54 శాతం క్షీణత), కోల్‌కత్తాలో 5366 నుంచి 1273 యూనిట్లకు (76 శాతం క్షీణత), ముంబైలో 16097 నుంచి 7352 యూనిట్లకు (54 శాతం క్షీణత), నోయిడాలో 2124 నుంచి 1528 యూనిట్లకు (28 శాతం క్షీణత) తగ్గాయి.