ఏటా హైదరాబాద్‌లో సుమారు 15 వేలు కొత్త గృహాలు ప్రారంభమవుతాయి. కానీ, ఈ ఏడాది హెచ్1లో కేవలం 3,706 యూనిట్లే ప్రారంభమయ్యాయని నైట్‌ఫ్రాంక్ తెలిపింది. పెద్ద నోట్ల రద్దు, వస్తు సేవల పన్ను (జీఎస్టీ), రెరా ఇవే ప్రధాన కారణమని చెప్పారు. ‘2018 అర్ధ సంవత్సరం: ఇండియన్ రియల్ ఎస్టేట్’ 9వ నివేదికలోని ముఖ్యాంశాలివే..రూ.25 లక్షల లోపు గృహాల్లేవ్..
ఏడాది కాలంలో హైదరాబాద్‌లో కొత్త గృహాల ప్రారంభాల్లో 44 శాతం వృద్ధి నమోదైంది. 2018 హెచ్1లో నగరంలో 3,706 కొత్త గృహాలు ప్రారంభమయ్యాయి. ఇందులో 2,628 యూనిట్లు (71 శాతం) పశ్చిమ హైదరాబాద్‌లోనే కేంద్రీకృతమయ్యాయి. కొత్త గృహాల్లో 47 శాతం యూనిట్లు రూ.75 లక్షల నుంచి కోటి రూపాయల మధ్య ఉన్నవే. రూ.2–4 కోట్ల ధర ఉన్న గృహాలు 3 శాతం పశ్చిమ ప్రాంతాల్లో ప్రారంభమయ్యాయి. ఇక, రూ.25 లక్షల లోపు ధర ఉన్న అందుబాటు గృహాలు ఒక్కటంటే ఒక్కటి కూడా ప్రారంభం కాలేదు.
తొలిసారి 8 వేల ఇళ్ల విక్రయం..ఏడాది కాలంలో నగరంలో అమ్మకాల్లో 5 శాతం వృద్ధి నమోదైంది. హెచ్1లో 8,313 ఇళ్లు విక్రయమయ్యాయి. ఇందులో 5,766 యూనిట్లు పశ్చిమ హైదరాబాద్‌లోనే జరిగాయి. రాష్ట్రం విడిపోయాక హైదరాబాద్‌లో తొలిసారిగా 8 వేలకు పైగా గృహాలకు విక్రయామయ్యాయి. హెచ్1లో నగరంలో 8,313 ఇళ్లు అమ్ముడుపోయాయి. కార్యాలయాల మార్కెట్ ఆశాజనకంగా ఉండటంతో నివాస విభాగం వృద్ధికి కారణమని నైట్‌ఫ్రాంక్ తెలిపింది. 69 శాతం విక్రయాలు మౌలిక వసతులు మెరుగ్గా ఉన్న ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, మాదాపూర్, కొండాపూర్, నానక్‌రాంగూడ వంటి పశ్చిమ ప్రాంతాల్లోనే జరిగాయి.
హైదరాబాద్‌లో 8 శాతం ధర వృద్ధి..ఆసక్తికరమైన విషయమేంటంటే.. ఈ ఏడాది హెచ్1లో హైదరాబాద్‌లో మినహా మిగిలిన అన్ని ప్రధాన నగరాల్లో స్థిరాస్తి ధరలు తగ్గాయి. నగరంలో గృహాల సప్లయి, డిమాండ్‌కు మధ్య భారీ వ్యత్యాసం ఉండటంతో ఏడాది కాలంలో 8 శాతం ధర వృద్ధి చెందింది. ఇక, ఎన్సీఆర్లో 10 శాతం, ముంబైలో 9 శాతం, పుణె, కోల్‌కత్తాలో 8 శాతం తగ్గాయి. బెంగళూరు, అహ్మదాబాద్‌లో ధరలు స్థిరంగా ఉన్నాయి. నగరంలో ఇంకా 12,749 ఇళ్లు అమ్ముడుపోకుండా ఇన్వెంటరీగా ఉన్నాయి. వీటిల్లో పశ్చిమంలో 7,397, ఉత్తరంలో 2,099, దక్షిణంలో 1,704, సెంట్రల్లో 788, తూర్పు హైదరాబాద్‌లో 762 యూనిట్లున్నాయి. వీటి అమ్మకాలకు మరో ఏడాదిన్నర సమయం పడుతుంది.