Prapancha Telugu

Latest Telugu News & information portal for Indians & NRI’s  

For more information contact :  info@prapanchatelugu.com

అమెరికాలో ఓ ఇంటికి నిప్పు పెట్టడమే కాకుండా.. కాల్పులు జరిపిన దుండగుడు.. ముగ్గురు దుర్మరణం

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం జరిగింది. టెక్సాస్ లోని హూస్టన్ లో ఓ దుండగుడు కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో ముగ్గురు పౌరులు మరణించారు. అయితే.. పోలీసులు జరిపిన కాల్పుల్లో నిందితుడు కూడా మరణించాడు. ఈ విషయాన్ని పోలీసులు ధ్రువీకరించారు. హూస్టన్ లోని ఓ ఇంటికి దుండగుడు నిప్పంటించడంతో అందరూ బయటకు పరుగులు తీశారు. ఈ సమయంలోనే ఆ దుండగుడు వారిపై కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో చనిపోయిన వారంతా 40 నుంచి 60 ఏండ్ల వయస్సున్న వారేనని పోలీసులు తెలిపారు.

Related Posts

Latest News Updates