రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా ఆమె గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, ముఖ్యమంత్రి వైఎస్ జగన్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రాష్ట్రపతికి ఘన స్వాగతం పలికారు. అనంతరం ఎయిర్పోర్టులో ద్రౌపదీ ముర్ము పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. రాష్ట్రపతి పర్యటన నేపథ్యం లో గన్నవరం పరిసర ప్రాంతాల్లో పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు. తన రెండు రోజుల పర్యటనలో భాగంగా ఆదివారం, సోమవారం విజయవాడ, విశాఖపట్నం, తిరుపతిల్లో జరిగే పలు కార్యక్రమాల్లో ద్రౌపది ముర్ము పాల్గొంటారు.
