Prapancha Telugu

Latest Telugu News & information portal for Indians & NRI’s  

For more information contact :  info@prapanchatelugu.com

నలుగురి ఎమ్మెల్యేలకు 20 కోట్ల చొప్పున బీజేపీ ఆఫర్ ఇచ్చింది : ఆప్ ఆరోపణ

ఆప్, బీజేపీ మధ్య మాటల యుద్ధం ఇంకా కొనసాగుతూనే వుంది. లిక్కర్ అవినీతిలో డిప్యూటీ సీఎం సిసోడియా ఇంటిపై సీబీఐ రైడ్స్ చేయడంతో మొదలైన విమర్శల పరంపర ఇంకా కొనసాగుతోంది. తాజాగా… ఆప్ సీనియర్లు బీజేపీపై సంచలన ఆరోపణలకు దిగారు. బీజేపీలో చేరితే తమ పార్టీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలకు ఒక్కొక్కరికి 20 కోట్ల చొప్పున బీజేపీ ఆఫర్ ఇచ్చిందని ఆప్ రాజ్యసభ సభ్యుడు సంజయ్ సింగ్ ఆరోపించారు.

 

అజయ్ దత్, సంజీవ్ ఝా, సోమనాథ్ భారతి, కులదీప్ అనే ఎమ్మెల్యేలను బీజేపీ సంప్రదించిందని, పార్టీ మారాలని ఒత్తిడి తెచ్చారని, లేదంటే తప్పుడు కేసులు కూడా నమోదు చేస్తామని బెదిరింపులకు దిగారని సంజయ్ సింగ్ ఆరోపించారు.ఒక్కొక్కరికి రూ.20 కోట్లు…నలుగురు ఎమ్మెల్యేలకు బీజేపీ ఆఫర్ చేసిందన్నారు. ఒకవేళ బీజేపీలో చేరని పక్షంలో మనీశ్ సిసోడియా లాగా సీబీఐ, ఈడీ దాడులను ఎదుర్కోవాల్సి వుంటుందని కూడా అన్నారని ఆయన పేర్కొన్నారు. ఏమి చేసైనా తమ పార్టీ ఎమ్మెల్యేలను బీజేపీ వైపు రప్పించేందుకు, కేజ్రీవాల్ సర్కార్ ను కూల్చేందుకు ప్రధాని మోదీ ప్రయత్నాలు చేస్తున్నారని ఆప్ పేర్కొంది.

Related Posts

Latest News Updates