ప్రముఖ నటి మీనా రెండో వివాహానికి సంబంధించి సోషల్ మీడియాలో తెగ వార్తలు వైరల్ అవుతున్నాయి. ఆమె భర్త విద్యా సాగర్ మరణించిన విషాదం నుంచి కుటుంబీకులు కోలుకోక ముందే ఈ వార్తలు రావడం విషాదం. ఆమె భవిష్యత్తు దృష్టిలో పెట్టుకుని ఆమె తల్లిదండ్రులు రెండో పెళ్లి చేసుకోమంటున్నారని, అందుకు మీనా కూడా సిద్ధపడినట్లు వార్తలొచ్చాయి. ఈ వార్తలపై హీరోయిన్ మీనా స్పందించింది. అవన్నీ ఒఠ్ఠి రూమర్స్ అని ఖండించింది. తాను మరో పెళ్లి చేసుకోవడం లేదని స్పష్టం చేసింది. తన భర్త మరణించారన్న బాధ నుంచే ఇంకా కోలుకోలేదని, అప్పుడే రెండో పెళ్లి ఎలా చేసుకుంటానని ప్రశ్నించారు. ప్రస్తుతం కొన్ని కథలను వింటున్నానని, ఫిబ్రవరి నుంచి షూటింగ్ లో పాల్గొంటానని ప్రకటించారు.
