ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. లోక కల్యాణ్ మార్గ్ నివాసంలో జగన్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పోలవరం, రిసోర్స్ గ్యాప్ కింద నిధులు, జాతీయ ఆహార భద్రతా చట్టం కింద అర్హుల ఎంపికలో హేతుబద్ధతతో పాటు విభజన హామీల అమలు, ప్రత్యేక హోదాతో సమాలు పలు అంశాలపై ప్రధాని మోదీకి సీఎం జగన్ వినపతి పత్రం అందించి, చర్చించారు.
పోలవరం ప్రాజెక్టును త్వరితగతింగా పూర్తి చేయాలని కోరారు. అలాగే నిర్వాసితుల పునరావాస కల్పనపై కూడా సీఎం జగన్ ప్రధాని మోదీతో చర్చించారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం పక్షాన పోలవరం ప్రాజెక్టుకు 2900 కోట్లు ఖర్చు చేశామని, వాటిని వెంటనే రియంబర్స్ మెంట్ చేయాలని ప్రధానిని కోరారు. ప్రధాని మోదీతో భేటీ అయిన తర్వాత సీఎం జగన్ కేంద్ర విద్యుత్ మంత్రి ఆర్కే సింగ్ తో సమావేశమయ్యారు. ఇక.. సాయంత్రం 6 గంటలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో భేటీ అవుతారు.