Prapancha Telugu

Latest Telugu News & information portal for Indians & NRI’s  

For more information contact :  info@prapanchatelugu.com

మేము వచ్చాక నేతన్నల ఆదాయం మూడు రెట్లు పెంచాం : ఏపీ సీఎం జగన్

ఈ దేశ స్వాతంత్ర్య సమరాన్ని ఓ మగ్గం మార్చేసిందని, అలాంటి మగ్గాన్ని నేసే వారికి తమ ప్రభుత్వం అండగా వుందని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. గత ప్రభుత్వాలు చేనేత రంగానికి అండగా నిలవలేదని, పాదయాత్ర సందర్భంగా నేతన్నల జీవితాలను గమనించానని, అందుకే అధికారంలోకి రాగానే నేతన్న నేస్తం తెచ్చామని సీఎం జగన్ అన్నారు. పెడన వద్ద వైఎస్సార్ నేతన్న నేస్తం నాల్గవ విడత నిధుల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రసంగించారు. అన్ని వర్గాలకు ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా సామాజిక న్యాయంలో సరికొత్త అధ్యాయానికి తెరలేపామని వివరించారు. ఇప్పటివరకు వైఎస్సార్‌ నేతన్న నేస్తం పథకం ద్వారా లబ్ధిదారులకు రూ. 776.13 కోట్లు సాయం అందించామని ఆయన గుర్తు చేశారు.

 

 

ఈ నాలుగేళ్లలో ప్రతి కుటుంబానికి ఏడాది రూ.24 వేల చొప్పున.. ఇప్పటిదాకా రూ.96 వేలు సాయం అందించామని, లంచాలకు అవకాశం లేకుండా నేరుగా ప్రభుత్వ సాయం అందిస్తున్నామని సీఎం జగన్ అన్నారు. వరుసగా నాలుగో ఏడాది వైఎస్సార్‌ నేతన్న పథకం ద్వారా లబ్ధిదారులకు లబ్ధి చేకూరుతోందని, ఇప్పటివరకు నేతన్నల సంక్షేమం కోసం రూ.2,049 కోట్ల రూపాయలు ఖర్చు చేశామని, గతంలో ఏ ప్రభుత్వం ఇంతలా సాయం అందించలేదని సీఎం జగన్‌ తెలిపారు. ఈ ప్రభుత్వం వచ్చాక నేతన్నల ఆదాయం మూడు రెట్లు పెరిగిందని, ఈ-కామర్స్‌ సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకున్నామని పేర్కొన్నారు. చేనేత వస్త్రాలను ఆప్కో ద్వారా మార్కెటింగ్‌ చేస్తున్నామని, ఇవాళ 80, 546 మంది నేతన్నలకు రూ.193.31 కోట్లు జమ చేస్తున్నట్లు తెలిపారు. ఒక్క చేనేత మాత్రమే కాదు.. అన్ని వర్గాలకు అండగా నిలుస్తున్నాం. చంద్రబాబు పవర్‌లో ఉన్నప్పుడు ఒకే వర్గానికి ప్రాధాన్యం ఇచ్చారని, తాము మాత్రం అందరికీ న్యాయం చేస్తున్నామని సీఎం జగన్ అన్నారు.

Related Posts

Latest News Updates