Prapancha Telugu

Latest Telugu News & information portal for Indians & NRI’s  

For more information contact :  info@prapanchatelugu.com

వినాయక మండపాల ఏర్పాటులో ఎలాంటి రుసుము లేదు : క్లారిటీ ఇచ్చిన ఏపీ ప్రభుత్వం

ఏపీలో వినాయక మండపాల ఏర్పాటు చేయాలంటే 1,000 రూపాయలు కట్టాల్సిందేనంటూ తీవ్ర ప్రచారం జరుగుతోంది. దీనిపై అటు హిందూ సంఘాలు, ప్రతిపక్షాలు తీవ్రంగా తప్పుబడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వ స్పందించింది. రాష్ట్రంలో వినాయక మండపాల ఏర్పాటుకు ఎలాంటి చలానాలు కట్టించాలని అవరం లేదని దేవాదాయ మంత్రి కొట్టు సత్యనారాయణ స్పష్టం చేశారు. అనవసర అసత్య ప్రచారాలు జరుగుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏ మీటింగ్ సమావేశం అయినా మైక్ పర్మిషన్ కోసం వంద రూపాయలు చలనా కట్టాలని… అదే విధంగా ఫైర్ సేఫ్టీకి సంబంధించి రూ.500 ఫీజ్ ఉంటుందని తెలిపారు. సోషల్ మీడియా ద్వారా ప్రజల్ని గందరగోళం కలిగించేలా ప్రచారం చేస్తున్నారని అన్నారు. భగవంతుడిపై దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.

 

ఇక… ఏపీ దేవాదాయ శాఖ కమిషనర్ జవహర్ లాల్ కూడా స్పందించారు. రాష్ట్రంలో వినాయక చవితి మండపాల ఏర్పాటుకు ఎలాంట రుసుములు కట్టాల్సిన అవసరం లేదన్నారు. అయితే.. స్థానికంగా పోలీస్, రెవిన్యూ అధికారులను మాత్రం సంప్రదించాలని, చట్టపరమైన అనుమతులు మాత్రం తీసుకోవాలన్నారు. ఈ నిబంధనలు మినహాయించితే… ఇక ఎలాంటి రుసుములు, చందాలు కట్టాల్సిన అవసరం లేదన్నారు. ఎవరైనా ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేస్తే.. చట్టపరమైన చర్యలు తీసుకుంటామని జవహర్ లాల్ తీవ్రంగా హెచ్చరించారు. మండపాల ఏర్పాటులో రుసుములు వసూలు చేస్తున్నాయని ఫిర్యాదులు వస్తే వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Related Posts

Latest News Updates