Prapancha Telugu

Latest Telugu News & information portal for Indians & NRI’s  

For more information contact :  teluguabroad.com@gmail.com 

3.3 ఎకరాల్లో అపర్ణా మాప్లే

హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ నిర్మాణ సంస్థ అపర్ణా కన్‌స్ట్రక్షన్స్‌ అండ్‌ ఎస్టేట్స్‌ బెంగళూరులో సరికొత్త ప్రాజెక్ట్‌ను ప్రారంభించింది. హోబ్లీలోని కేఆర్‌ పురం దగ్గర్లో అపర్ణా మాప్లే పేరిట గేటెడ్‌ కమ్యూనిటీ ప్రాజెక్ట్‌ను లాంచింగ్‌ చేసింది. 3.3 ఎకరాల్లో సుమారు 246 అపార్ట్‌మెంట్లను నిర్మిస్తోంది. రెండు టవర్లు.. ఒక్కోటి 14 అంతస్తుల్లో ఉంటుంది. 1,165 చ.అ నుంచి 1,590 చ.అ. మధ్య ఫ్లాట్‌ కార్పెట్‌ ఏరియా ఉంటుంది. బెంగళూరులో అపర్ణా కన్‌స్ట్రక్షన్స్‌కు ఇది రెండో ప్రాజెక్ట్‌. ‘‘మాప్లే ప్రాజెక్ట్‌ బెంగళూరులో అభివృద్ధి చెందిన ప్రాంతంలో ఉంది. కమర్షియల్‌ హబ్స్, ఎయిర్‌పోర్ట్, ఓఆర్‌ఆర్, సెంట్రల్‌ బెంగళూరు వంటి అన్ని ప్రాంతాలకు కనెక్టివిటీ సులువుగా ఉంటుందని’’ కంపెనీ డైరెక్టర్‌ రాకేష్‌ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. 2022 డిసెంబర్‌ నాటికి నిర్మాణం పూర్తవుతుందని పేర్కొన్నారు.

Related Posts

Latest News Updates