Prapancha Telugu

Latest Telugu News & information portal for Indians & NRI’s  

For more information contact :  info@prapanchatelugu.com

14 ఏండ్ల తర్వాత ఆమోదం.. వచ్చే ఏడాది నుంచి అమెరికాలో

జన్యు మార్పిడి చేసిన ఊదా రంగు టమాటాల పెంపకానికి అమెరికా ఆమోదం తెలిపింది. 2008లో యూరోపియన్‌ పరిశోధకులు డ్రాగన్‌ పుష్పాల జీన్స్‌ను టమాటలో ప్రవేశపెట్టి వీటిని సృష్టించారు. వీటిలో క్యాన్సర్‌ వ్యాధిని నిరోధించే ఆంతోసయానిస్‌ అనే పదార్థం ఉంటుంది. ఈ టమాటాలు చూడగానే నల్ల వంకాయల్లా కనిపిస్తాయి. ఇటలీ, జర్మనీ నెదర్లాండ్స్‌ పరిశోధకులు సృష్టించిన ఈ జన్యుమార్పిడి (జీఎంవో) పంటను తమ దేశంలో పండిరచేందుకు మొదట అమెరికా వ్యవసాయ శాఖ ఒప్పుకోలేదు. 14 ఏండ్ల తర్వాత ఎట్టకేలకు అంగీకరించింది. వచ్చే ఏడాది నుంచి ఈ పంటను అమెరికాలో పండిరచవచ్చని  ఆ దేశ వ్యవసాయ శాఖ ప్రకటించింది.

Related Posts

Latest News Updates