Prapancha Telugu

Latest Telugu News & information portal for Indians & NRI’s  

For more information contact :  info@prapanchatelugu.com

మళ్లీ వాయిదాపడ్డ ఆర్టెమిస్-1 ప్రయోగం… సెప్టెంబర్ మొదటి వారంలో మళ్లీ ప్రయోగం?

అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా చేపట్టిన ఆర్టెమిస్-1 ప్రయోగం వాయిదా పడింది. ఇంజన్ లో సాంకేతిక సమస్య తలెత్తడంతో ఈ మిషన్ ను నిలిపేస్తున్నట్లు శాస్త్రవేత్తలు ప్రకటించారు. ఇంజన్ నుంచి ఇంధనం లీక్ అయ్యిందని, షెడ్యూల్ ప్రకారమే కౌంట్ డౌన్ ప్రారంభమైనప్పటికీ, చివరి గంటలో ఈ ప్రయోగాన్ని నిలిపేశారు. అయితే… తిరిగి ఎప్పుడు చేపడతారన్నది మాత్రం అధికారికంగా ప్రకటించలేదు. అయితే… సెప్టెంబర్ మొదటి వారంలో మళ్లీ ప్రయోగిస్తారని సమాచారం. ర్టెమిస్‌–1 ప్రయోగంలో భాగంగా రాకెట్‌లో 10 లక్షల గ్యాలన్ల అతిశీతల హైడ్రోజన్, ఆక్సిజన్‌ నింపాల్సి ఉంది. 4 ఇంజిన్లు ఉన్న ఈ రాకెట్‌లో ఒకదాంట్లో ఇంధనం లీక్‌ అవుతున్నట్లు గుర్తించారు. లాంచ్‌ప్యాడ్‌పై రాకెట్‌ ఉన్నచోట పిడుగు పడడంతో ఈ పరిస్థితి ఉత్పన్నమైనట్లు భావిస్తున్నారు.

Related Posts

Latest News Updates