Prapancha Telugu

Latest Telugu News & information portal for Indians & NRI’s  

For more information contact :  info@prapanchatelugu.com

గంటకు 180 కిలోమీటర్లు… దంచి కొట్టిన ‘వందే భారత్ రైలు’

భారత్ లో అభివ్రుద్ధి చేసిన సెమీ హైస్పీడ్ రైల్ వందే భారత్ రైలు మొదటి ట్రయల్ రన్ లో దుమ్ము రేపింది. గంటకు 180 కిలోమీటర్ల వేగంతో దూసుకపోయింది. ఈ విషయాన్ని కేంద్ర రైల్వే మంత్రి అశ్వనీ వైష్ణవ్ ట్విట్ఠర్ వేదికగా వెల్లడించారు. వందే భారత్ రైల్ టెస్ట్ రన్ ను కోటా- నాగ్డా సెక్షన్ మధ్య పరీక్షించారు. టెస్ట్ రన్ నిర్వహిస్తున్న సమయంలో రైలు వేగంతో పాటు అన్ని ప‌రిక‌రాల ప‌నితీరును ప‌రిశీలించిన‌ట్లు ఆయ‌న వెల్ల‌డించారు. కోటా-నాగ్డా రూట్లో రైలు స్పీడ్ లెవ‌ల్స్‌ను టెస్ట్ చేసిన‌ట్లు మంత్రి తెలిపారు. 16 కోచ్‌ల‌తో వందేభార‌త్ రైలును ప‌రీక్షించారు. కోటా డివిజ‌న్‌లో వివిధ ద‌శ‌ల్లో ట్ర‌య‌ల్స్ చేప‌ట్టారు. కోటా నుంచి ఘాట్ కా బ‌రానా మ‌ధ్య మొద‌టి ద‌శ ట్ర‌య‌ల్‌, ఘాట్ కా బ‌రానా నుంచి కోటా మ‌ధ్య రెండో ద‌శ ట్ర‌య‌ల్‌, కుర్లాసీ నుంచి రామ్‌గంజ్ మ‌ధ్య మూడ‌వ ద‌శ ట్ర‌య‌ల్‌, నాలుగ‌వ‌-అయిద‌వ ద‌శ ట్ర‌య‌ల్ కూడా ఈ స్టేష‌న్ల మ‌ద్య డౌన్‌లైన్‌లో చేప‌ట్టారు.

 

Related Posts

Latest News Updates