Telugu Abroad

Latest Telugu News & information portal for Indians & NRI’s  

For more information contact :  teluguabroad.com@gmail.com 

అసైన్డ్‌ భూమి ఇప్పించండి: ఎమ్మెల్సీ శంభీపూర్‌ రాజుకు వినతి

తన తండ్రి పేరిట ఉన్న అసైన్డ్‌ భూమిని తిరిగి తనకు ఇప్పించాలని ఖానామెట్‌కు చెందిన సత్తెమ్మ, మణెమ్మ, పుణ్యవతి, శేఖర్‌ గౌడ్, శంకర్‌ గౌడ్‌లు ఎమ్మెల్సీ శంభీపూర్‌ రాజుకు వినతిపత్రం అందజేశారు. గౌండ్ల శంకరయ్య పేరిట ఖానామెట్‌ సర్వే నెంబర్‌ 41/3లో ఐదు ఎకరాల భూమి ఉందని తెలిపారు. రిటైర్డ్‌ రెవెన్యూ ఉద్యోగి కబ్జాలో ఉన్నాడని, అనుమతులు లేకుండా షెడ్లు నిర్మింస్తున్నారని వినతి పత్రంలో పేర్కొన్నారు. శేరిలింగంపల్లి తహసిల్దార్‌కు ఫిర్యాదు చేసిన పట్టించుకోలేదని పేర్కొన్నారు. తమకు న్యాయం చేయాలని కోరారు.

Related Posts

Latest News Updates