Prapancha Telugu

Latest Telugu News & information portal for Indians & NRI’s  

For more information contact :  info@prapanchatelugu.com

కాంగ్రెస్ కు ఝలక్…. పార్టీకి గుడ్ బై చెప్పేసిన గులాంనబీ ఆజాద్

కాంగ్రెస్ పార్టీకి సీనియర్ నేత గులాంనబీ ఆజాద్ గుడ్ బై చెప్పేశారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వంతో సహా అన్ని పదవులకు రాజీనామా చేస్తున్నానని సంచలన ప్రకటన చేశారు. ఈ మేరకు రాజీనామా లేఖను అధినేత్రి సోనియా గాంధీకి పంపించారు. పార్టీలో కోటరీ మరింత పెరిగిపోయిందని, ఆ కోటరీలోనూ అనుభవం లేని నేతలే ఎక్కువయ్యారని ఘాటు విమర్శలు చేశారు. ఇక… రాహుల్ గాంధీ పరిణతి కలిగిన నేత కాదని, అందుకే పార్టీ ఇలా ఘోర పరిస్థితులను చవిచూస్తోందంటూ మండిపడ్డారు. రాహుల్ గాంధీవన్నీ పిల్లచేష్టలంటూ మండిపడ్డారు. గతంలో ప్రధానిగా మన్మోహన్ వున్న కాలంలో ప్రభుత్వ ఆర్డినెన్స్ ను బహిరంగంగా రాహుల్ చించేశారని, ఇది పిల్లచేష్ట కాక ఇంకేమి? అంటూ ఆజాద్ గుర్తు చేశారు. సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ అవమానకరమైన ఫలితాలను మోసుకొచ్చిందని, ఇప్పుడు కొన్ని రాష్ట్రాలకే పరిమితమైందని ఎద్దేవా చేశారు.

 

మరోవైపు ఆజాద్ రాజీనామాపై కాంగ్రెస్ స్పందించింది. ఇది దురద్రుష్ట ఘటన అని అభివర్ణించింది. బీజేపీ వైఫల్యాలపై పోరాటంలో పార్టీ మునిగిన సమయంలో ఆజాద్ రాజీనామా చేయడం దురద్రుష్టకరమని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ అన్నారు. మరోవైపు కొన్ని రోజుల క్రిందటే జమ్మూ కశ్మీర్ ప్రచార కమిటీ బాధ్యతల నుంచి ఆజాద్ తప్పుకున్నారు. తనకు ఆరోగ్యం ఏమాత్రం సహకరించడం లేదని పేర్కొంటూ… ఆ పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే.

Related Posts

Latest News Updates