Prapancha Telugu

Latest Telugu News & information portal for Indians & NRI’s  

For more information contact :  info@prapanchatelugu.com

కేసీఆర్ ను విడిచిపెట్టం… జైళ్లో గదులు రెడీగా వున్నాయ్… అగ్గిమీద గుగ్గిలమైన బండి సంజయ్

ముఖ్యమంత్రి కేసీఆర్ ను వదిలే ప్రసక్తే లేదని , కరీంనగర్ జైలులో కేసీఆర్ కు రూమ్ రెడీ చేశామని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ నిప్పులుకక్కారు. కేసులతో బీజేపీ నేతలను భయపెట్టలేరని, ఎంఐఎం కుట్రలను తట్టుకొని, ధర్మం కోసం బీజేపీ నేతలు పనిచేస్తున్నారని పేర్కొన్నారు. నాలుగో విడత ప్రజా సంగ్రామ యాత్రను కూడా నిర్వహించి తీరుతామని, సెప్టెంబర్ 12 నుంచే నాలుగో విడత ప్రజా సంగ్రామ యాత్ర ప్రారంభిస్తామని బండి సంజయ్ కీలక ప్రకటన చేశారు. టీఆర్ఎస్ సర్కార్ ఎన్ని ఇబ్బందులు పెట్టినా… ప్రజా సంగ్రామ యాత్రను నిర్వహించి తీరుతామని శపథం చేశారు. బీజేపీ నేతలు ధర్మం కోసం పనిచేస్తే… టీఆర్ఎస్ కార్యకర్తలు మాత్రం పార్టీ కోసమే పనిచేస్తారన్నారు. మూడో విడత ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సభ హనుమకొండలో జరిగింది.

 

ఈ సభలో రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మాట్లాడారు. కేసీఆర్ గడీలు బద్దలు కొట్టే రోజు దగ్గర్లోనే వుందని, తెలంగాణ ప్రజానీకం అంతా కలిసి కేసీఆర్ ప్రభుత్వంపై యుద్ధం చేయాలని పిలుపునిచ్చారు. కేసీఆర్ కుటుంబంపై లిక్కర్ కుంభకోణం ఆరోపణలు వచ్చాయని, అందుకే ప్రజా సంగ్రామ యాత్రను అడ్డుకునేందుకు కుట్రలు చేశారని భగ్గుమన్నారు. ఏ కుంభకోణం జరిగినా… దానికి, కేసీఆర్ కుటుంబానికి లింకులు వున్నాయని బండి సంజయ్ ఎద్దేవా చేశారు. లిక్కర్ కుంభకోణం నుంచి కుటుంబాన్ని ఎలా కాపాడుకోవాలా? అని సీఎం కేసీఆర్ చూస్తున్నారని ఎద్దేవా చేశారు.

 

బీజేపీ ఏ మతాన్ని కూడా ద్వేషించలేదని స్పష్టం చేశారు. హిందూ దేవతలను అవమానించే మునావర్ ఫారుఖీ షోకు ఎవరు అనుమతినిచ్చారని సూటిగా ప్రశ్నించారు. రెండు వేల మందితో ఎందుకు భద్రతనిచ్చారని సూటిగా ప్రశ్నించారు. ఇలా అనుమతులిస్తూ.. ఎవరు మతవిద్వేషాలు రెచ్చగొడుతున్నారో అందరికీ తెలుసుంటూ బండి సంజయ్ చురకలంటించారు. బీజేపీని బదనాం చేయడానికే హైద్రాబాద్ లో మత ఘర్షణలు పుట్టిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ హైదరాబాద్లో మతవిధ్వేషాలు రెచ్చగొట్టి రాజకీయ లబ్ది పొందాలనే కుట్రలకు పాల్పడ్డారని బండి సంజయ్ ఆరోపించారు. ఇంత చేస్తూ తమపై ఆరోపణలు చేయడం సిగ్గుచేటంటూ బండి సంజయ్ విరుచుకుపడ్డారు.

Related Posts

Latest News Updates