Prapancha Telugu

Latest Telugu News & information portal for Indians & NRI’s  

For more information contact :  info@prapanchatelugu.com

సీఎం కేసీఆర్ కి పేరు ప్రఖ్యాతులు ముఖ్యమా? పేదల ఆరోగ్యం ముఖ్యమా? బండి సంజయ్

ఇబ్రహీంపట్నం ఆస్పత్రిలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు వికటించిన ఘటనలో చికిత్స పొందుతున్న బాధిత మహిళలను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పరామర్శించారు. తెలంగాణ ప్రభుత్వం రికార్డు కోసమే గంటలో 34 కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేసిందని మండిపడ్డారు. మహిళలకు ఆపరేషన్ చేసే ముందు కనీస పరీక్షలు చేయలేదని ఆరోపించారు. కు.ని. చికిత్స చేస్తుండగా జరిగిన మరణాలకు ప్రభుత్వమే కారణమని మండిపడ్డారు. నలుగురు మహిళలు చనిపోతే సర్కార్ ఏం చేస్తోంది అని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్ కి పేరు ప్రఖ్యాతలు ముఖ్యమా.. పేదల ఆరోగ్యం ముఖ్యమా? అని బండి సంజయ్ ప్రశ్నించారు.

 

తన పేరు, ప్రఖ్యాతల కోసం ఈ రోజు పేదలు బలైతున్నారన్నారని బండి సంజయ్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కుటుంబ ఆపరేషన్లు వికటించి ప్రాణాలు కోల్పోతుంటే బాధితులను సీఎం ఎందుకు పరామర్శించడం లేదని బండి సంజయ్ సూటిగా ప్రశ్నించారు. ఎమ్మెల్యేలు, మంత్రులు సైతం ఒక్కరు కూడా ఇబ్రహీంపట్నం ఘటన బాధితులను పరామర్శించలేదని బండి సంజయ్ అన్నారు. భూమి కబ్జాలు, ఇసుక ,లిక్కర్, క్యాసినో ఆడుకుంటూ బిజీగా ఉన్నారా? అంటూ ఆయన కోపం వ్యక్తం చేశారు.పేదలను పరామర్శించకుండా ఉండేంత బిజీ అంత ఏముందని ప్రశ్నించారు. బాధితులకు తక్షణమే కోటి రూపాయల నష్ట పరిహారం చేయాలన్న బండి సంజయ్.. వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం, డబుల్ బెడ్ రూం ఇల్లును కల్పించాలని డిమాండ్ చేశారు.

Related Posts

Latest News Updates