Prapancha Telugu

Latest Telugu News & information portal for Indians & NRI’s  

For more information contact :  teluguabroad.com@gmail.com 

నరికినందుకు 39 వేలు జరిమానా!

భవనం వ్యూకు అడ్డొస్తుందని ఎదురుగా ఉన్న చెట్టు నరికేశాడు ఓ ప్రబుద్ధుడు. చట్టాన్ని ఉల్లంఘించి అనుమతులు లేకుండా అర్దరాత్రి అధికారుల కళ్లుగప్పి బంజారాహిల్స్‌ రోడ్‌ నం. 12 ప్రధాన రహదారిలో కొత్తగా నిర్మించిన ఓ వాణిజ్య భవనం ముందు మూడు చెట్లు కొట్టేసిన ఘటనలో యజమానికి ఫారెస్ట్‌ డిపార్ట్‌మెంట్‌ జరిమానా విధించింది. ఓ వైపు హరితహారంలో మొక్కలు నాటుతుంటే ఇంకోవైపు అర్ధరాత్రి చెట్లు కొట్టేస్తున్నారంటూ వారం రోజుల క్రితం వార్త ప్రచురితమైంది. అటవీశాఖ బంజారాహిల్స్‌ ఎస్‌ఐ మహేష్‌ ఈ వార్తపై స్పందించారు. భవన యజమానికి నోటీసులు జారీ చేశారు. విచారించగా అనుమతులు లేకుండానే చెట్లు కొట్టేసినట్లు తేలింది. దీంతో మంగళవారం భవన యజమాని ప్రవీణ్‌ రెడ్డికి రూ.39 వేల జరిమానా విధించారు.

Related Posts

Latest News Updates