Prapancha Telugu

Latest Telugu News & information portal for Indians & NRI’s  

For more information contact :  info@prapanchatelugu.com

భద్రకాళీ అమ్మవారిని దర్శించుకొని, పూజలు చేసిన జేపీ నడ్డా

బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్నారు. జేపీ నడ్డాతో సహా దర్శనానికి విచ్చేసిన నేతలకు దేవస్థానం అర్చకులు, అధికారులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా జేపీ నడ్డా అమ్మ వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. నడ్డా వెంట తరుణ్ చుగ్, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్ తదితరులు వున్నారు. భద్రకాళి ఆలయంలో పూజలు చేసిన తర్వాత తెలంగాణ ఉద్యమ కారుడు, రిటైర్డ్ ప్రొఫెసర్ వెంకట నారాయణ ఇంటికి వెళ్లారు. వారింట చాయ్ తాగారు.

 

ఆ తర్వాత రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల గురించి చర్చించారు. ఈ సమావేశంలో ప్రొఫెసర్ లింగమూర్తి, పుల్లూరి సుధాకర్ తదితరులు కూడా వున్నారు.  అంతకు ముందు జేపీ నడ్డా శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. ఆయనకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎంపీ లక్ష్మణ్ తో పాటు ఇతర నేతలు ఘనంగా స్వాగతం పలికారు. అక్కడి నుంచి నేరుగా నోవాటెల్ హోటల్ కు వెళ్లి, మిథాళీ రాజ్ తో భేటీ అయ్యారు.

Related Posts

Latest News Updates