Prapancha Telugu

Latest Telugu News & information portal for Indians & NRI’s  

For more information contact :  info@prapanchatelugu.com

ప్రజా సంగ్రామ యాత్రను ఆపం… తేల్చి చెప్పిన బీజేపీ

బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ నిర్వహిస్తున్న ప్రజా సంగ్రామ యాత్రను ఆపే ప్రసక్తే లేదని బీజేపీ నేతలు తేల్చి చెప్పారు. పోలీసుల అనుమతి ప్రకారమే ఇన్ని రోజులూ యాత్ర నిర్వహిస్తున్నామని ప్రజా సంగ్రామ యాత్ర ఇన్ ఛార్జీ, పార్టీ ప్రధాన కార్యదర్శి మనోహర్ రెడ్డి ప్రకటించారు. అప్పుడు లేని అభ్యంతరాలు ఇప్పుడే ఎందుకు వచ్చాయి? అంటూ సూటిగా ప్రశ్నించారు. బండి సంజయ్ పాదయాత్రను నిలిపివేయాలంటూ పోలీసులు నోటీసులు జారీ చేశారు. లేదంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామంటూ నోటీసులో జనగామ ఏసీపీ పేర్కొన్నారు.

 

ఈ నేపథ్యంలోనే బీజేపీ నేతలు స్పందించారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా ఎన్ని ఆంక్షలు పెట్టినా అనుకున్న షెడ్యూల్ ప్రకారం భద్రకాళి అమ్మవారి ఆలయం వరకు పాదయాత్ర కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఈ నెల 27న హన్మకొండలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తామని మనోహర్ రెడ్డి తెలిపారు. ధర్మ దీక్ష పేరుతో వివిధ జిల్లాల నుంచి భారీ ఎత్తున జన సమీకరణ చేస్తూ రెచ్చగొట్టే ప్రకటనలు చేయడం వల్ల శాంతి భద్రతలకు విఘాతం కలుగుతోందని తెలిపారు. ఈ నేపథ్యంలోనే పాతయాత్రను నిలిపివేస్తూ నోటీసులిచ్చామని పోలీసులు వివరణ ఇచ్చారు.

Related Posts

Latest News Updates