Prapancha Telugu

Latest Telugu News & information portal for Indians & NRI’s  

For more information contact :  info@prapanchatelugu.com

ఎమ్మెల్యే రాజాసింగ్ కు బెయిల్… పోలీసుల విచారణకు సహకరించాలని సూచన

బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ కు బెయిల్ లభించింది. శాంతి భద్రతల పరిరక్షణ కోసం.. ఉద్రిక్తతలను నివారించేందుకు రిమాండుకు పంపాలన్న ప్రాసిక్యూషన్ వాదనలను కోర్టు ఏకీభవించలేదు. అరెస్ట్ సమయంలో 41 సీఆర్‌‌పీసీ,సుప్రీంకోర్ట్‌ నియమాలు పాటించలేదన్న వాదనలతో కోర్టు ఏకీభవించింది. దీంతో రాజాసింగ్ కు బెయిల్ మంజూరు చేస్తున్నట్లు న్యాయస్థానం ప్రకటించింది. అరెస్టు చేసిన రాజాసింగ్ ను వెంటనే విడుదల చేయాలని పోలీసులకు ఆదేశాలిచ్చింది. రాజాసింగ్ బెయిల్ పిటిషన్లపై నాంపల్లి కోర్టులో సుమారు 45 నిమిషాలపాటు వాదనలు జరిగాయి. ఎమ్మెల్యేకు బెయిల్ లభిస్తే.. ఉద్రిక్తతలు తలెత్తుతాయని, శాంతిభద్రతలకు విఘాతం కలుగుతుందని పోలీసుల తరపు న్యాయవాది వాదించారు. దీనిని కోర్టు తోసిపుచ్చింది. ఆయనపై పెట్టిన కేసులన్నీ బెయిలబుల్ కేసులేనని తేల్చి చెప్పింది. అందుకే వెంటనే విడుదల చేయాలని, అయితే… పోలీసుల విచారణకు మాత్రం ఎమ్మెల్యే సహకరించాల్సిందేనని నాంపల్లి కోర్టు తేల్చి చెప్పింది.

 

కులాలు, మతాల మధ్య చిచ్చుపెట్టి విద్వేషాలు రెచ్చగొట్టారంటూ ఐపీసీ సెక్షన్ 153(A) కింద కేసు నమోదు చేశారు. అలాగే మత విశ్వాసాలను కించపర్చినందుకు సెక్షన్ 295-A కింద కేసు.. ప్రకటనల ద్వారా నష్టం కలిగించినందుకు సెక్షన్ 295-A.. బెదిరింపులకు పాల్పడినందుకు సెక్షన్ 506 కింద కేసులు నమోదు చేశారు. అయితే ఇవన్నీ బెయిలబుల్ కేసులే నంటూ రాజాసింగ్ న్యాయవాది వాదించగా.. కోర్టు అంగీకరించి బెయిల్ మంజూరు చేసింది. ఇక… రాజాసింగ్ ను నాంపల్లి కోర్టుకు తీసుకొచ్చిన సందర్భంలో బీజేపీ, ఎంఐఎం కార్యకర్తలు పోటాపోటీగా నినాదాలు చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం ఏర్పడటంతో పోలీసులు లాఠీఛార్జ్ చేశారు.

Related Posts

Latest News Updates