Prapancha Telugu

Latest Telugu News & information portal for Indians & NRI’s  

For more information contact :  info@prapanchatelugu.com

హైదరాబాద్ కు చేరుకున్న జేపీ నడ్డా… మిథాళీ రాజ్ తో భేటీ…

హనుమకొండ బీజేపీ సభలో పాల్గొనేందుకు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా హైదరాబాద్ కు చేరుకున్నారు. శంషాబాద్ ఎయిర్ పోర్టులో ఆయనకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎంపీ లక్ష్మణ్, తరుణ్ ఛుగ్ తదితరులు ఘనంగా స్వాగతం పలికారు. శంషాబాద్ నుంచి ఆయన నోవాటెల్ హోటల్ కు చేరుకున్నారు. అక్కడ ప్రముఖ క్రికెటర్ మిథాలీ రాజ్ తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మిథాలీ రాజ్ నడ్డాకు పుష్పగుచ్ఛం ఇచ్చి, గౌరవించారు. ఈ సమావేశంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా ఈ భేటీలో పాల్గొన్నారు.

 

 

అయితే.. జేపీ నడ్డా మిథాలీతో ఏం మాట్లాడారన్నది మాత్రం బీజేపీ నేతలు బయటపెట్టడం లేదు. ఈ సమావేశం తర్వాత జేపీ నడ్డా ప్రత్యేక విమానంలో హనుమకొండకు బయల్దేరుతారు. భద్రకాళీ అమ్మవారిని దర్శించుకొని, ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఆ తర్వాత ప్రొఫెసర్ వెంకట నారాయణను కలుసుకుంటారు. అక్కడి నుంచి హనుమకొండ ఆర్ట్స్ కాలేజీ ప్రాంగణానికి వెళ్లి, బహిరంగ సభలో ప్రసంగిస్తారు. ఈ సభ ముగియగానే… నడ్డా తిరిగి హైదరాబాద్ నోవాటెల్ హోటల్ కు చేరుకుంటారు. నటుడు నితిన్ తో భేటీ అవుతారు. రాత్రి 8 గంటలకు తిరిగి ఢిల్లీకి బయల్దేరుతారు.

Related Posts

Latest News Updates