Prapancha Telugu

Latest Telugu News & information portal for Indians & NRI’s  

For more information contact :  info@prapanchatelugu.com

హనుమకొండకు జేపీ నడ్డా… నితిన్, మిథాళీ రాజ్ తో భేటీ కానున్న నడ్డా

బీజేపీ జాతీయ అధ్యక్షుడు ఒక రోజు పర్యటనలో భాగంగా నేడు తెలంగాణకు రానున్నారు. హనుమకొండలోని ఆర్ట్స్ కాలేజీ ప్రాంగణంలో జరిగే ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు. ఇప్పటికే ఈ సభకు కావాల్సిన ఏర్పాట్లన్నీ పూర్తవుతున్నాయి. పోలీసుల అనుమతి లేదని ఆర్ట్స్ కాలేజీ ప్రిన్సిపల్ అనుమతి నిరాకరించడంతో బీజేపీ హైకోర్టును ఆశ్రయించింది. హైకోర్టు సభకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఏర్పాట్లన్నీ చకచకా పూర్తవుతున్నాయి. ఇక.. మధ్యాహ్నం 12 గంటలకు బీజేపీ జాతీ య అధ్యక్షుడు జేపీ నడ్డా శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకుంటారు.

 

అక్కడి నుంచి ఆయన నేరుగా నోవాటెల్ హోటల్ లో బస కోసం వెళ్తారు. పార్టీ ముఖ్య నేతలతో కీలక సమావేశం నిర్వహించనున్నారు. రాష్ట్రంలోని పరిస్థితులను అడిగి తెలుసుకుంటారని పార్టీ నేతలు అంటున్నారు. ఈ కీలక సమావేశం ముగిసిన తర్వాత జేపీ నడ్డా మహిళా క్రికెటర్ మిథాళీ రాజ్, ప్రత్యేకంగా భేటీ అవుతున్నారు. ఈ భేటీని పార్టీ కూడా ధ్రువీకరించింది. ఈ భేటీ ముగిసిన తర్వాత జేపీ నడ్డా ప్రత్యేక హెలికాప్టర్ లో హనుమకొండకు సభ కోసం బయల్దేరి వెళ్తారు.

 

వరంగల్ కు చేరుకోగానే జేపీ నడ్డా భద్రకాళీ అమ్మ వారి ఆలయానికి వెళ్లి, ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. ఆ తర్వాత ప్రొఫెసర్ వెంకట నారాయణతో భేటీ అవుతారు. ఆ తర్వాత బహిరంగ సభలో ప్రసంగిస్తారు. ఈ సమావేశం ముగిసిన తర్వాత మళ్లీ ప్రత్యేక హెలికాప్టర్ లో తిరిగి నగరంలోని నోవాటెల్ కు చేరుకుంటారు. అక్కడ హీరో నితిన్ తో ప్రత్యేకంగా భేటీ అవుతారు. రాత్రి 7 గంటలకు శంషాబాద్ నుంచి ఢిల్లీకి బయల్దేరి వెళ్తారు.

Related Posts

Latest News Updates