Prapancha Telugu

Latest Telugu News & information portal for Indians & NRI’s  

For more information contact :  info@prapanchatelugu.com

ఇంటి పన్నులకు బ్లాక్‌చెయిన్‌

హైదరాబాద్‌కు చెందిన టెక్నాలజీ స్టార్టప్‌ వెరీడాక్‌ గ్లోబల్‌ ఇండియా థానే మున్సిపల్‌ కార్పొరేషన్‌ (టీఎంసీ)కు బ్లాక్‌ చెయిన్‌ ఆధారిత ప్రాపర్టీ టాక్స్‌ అసెస్‌మెంట్‌ పైలెట్‌ ప్రాజెక్ట్‌ను విజయవంతంగా పూర్తి చేసింది. దేశంలో తొలి ప్రాజెక్ట్‌ ఇదేనని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. బ్లాక్‌ చెయిన్‌ టెక్నాలజీతో ఇంటి పన్ను చెల్లింపులు, అనుమతులు వేగవంతమవటమే కాకుండా పారదర్శకత నెలకొంటుందని కంపెనీ సీఈవో రియా అచాల్కర్‌ తెలిపారు. గృహ యజమానులు, బ్యాంక్‌లు, అధికారులు, కొనుగోలుదారులు అందరికీ ఒకే వేదికగా ప్రాపర్టీ ట్యాక్స్‌ల సమాచారం అందుబాటులో ఉంటుందని పేర్కొన్నారు.

Related Posts

Latest News Updates