Prapancha Telugu

Latest Telugu News & information portal for Indians & NRI’s  

For more information contact :  info@prapanchatelugu.com

బీజేపీలోకి బూర నర్సయ్య గౌడ్!

టీఆర్ఎస్ నేత, మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ భారతీయ జనతా పార్టీలో చేరనున్నట్టు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. ఇప్పటికే ఆయన, బీజేపీ పెద్దలతో మంతనాలు సాగిస్తున్నట్టు సమాచారం. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్తో బూర చర్చలు జరిపినట్టు తెలిసింది. అనంతరం ఢిల్లీ చేరుకున్న ఆయన తరుణ్ చుగ్తో సమావేశమయ్యారని, పార్టీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిసే ప్రయత్నాల్లో ఉన్నట్టు తెలిసింది. అయితే ఈ విషయంపై ఆయన్ను సంప్రదించేందుకు ప్రయత్నించగా.. ఫోన్లో అందుబాటులో లేరు.

మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గం ఉపఎన్నికల్లో పోటీచేయాలని భావించినప్పటికీ, టీఆర్ఎస్ నాయకత్వం చివరకు కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికే మొగ్గు చూపడంతో బూర నర్సయ్య గౌడ్ మనస్తాపానికి గురయ్యారు. నాయకత్వం ఆయనతో మాట్లాడి బుజ్జగించినట్టు కూడా వార్తలొచ్చాయి. ప్రభాకర్ రెడ్డి నామినేషన్ కార్యక్రమంలోనూ బూర నర్సయ్య గౌడ్ పాల్గొన్నారు. కానీ అకస్మాత్తుగా ఆయన ఢిల్లీకి పయనమవడం రాజకీయవర్గాల్లో చర్చకు దారితీసింది.

Related Posts

Latest News Updates