కేరళకు చెందిన ఐటీ ఆధారిత నిర్మాణ సేవల సంస్థ బిల్డ్ నెక్ట్స్ హైదరాబాద్‌లో కార్యకలాపాలను ప్రారంభించింది. వర్చువల్ రియాలిటీ (వీఆర్) ఆధారిత కేంద్రాల ద్వారా వినియోగదారులకు సేవలందించడం దీని ప్రత్యేకత. బంజారాహిల్స్‌లో తొలి వీఆర్ కేంద్రాన్ని అనూహ్య రీతిలో స్పందన వస్తుందని.. ఇప్పటికే 6 లక్షల చ.అ. లావాదేవీలను సాధించామని ఫౌండర్ వీ గోపాలకృష్ణన్ తెలిపారు. త్వరలోనే హైటెక్ సిటీలో మరొకటి, ఏడాదిలో ఐదు కేంద్రాలను ప్రారంభిస్తామని పేర్కొన్నారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్, కర్నాటక, తమిళనాడు, మహారాష్ట్రలో సేవలను ప్రారంభించడంతో పాటూ ఏడాదిలో వంద కోట్ల టర్నోవర్‌ను లక్ష్యించామని తెలిపారు.