Prapancha Telugu

Latest Telugu News & information portal for Indians & NRI’s  

For more information contact :  info@prapanchatelugu.com

ఉగ్రవాద సంస్థలతో సంబంధాలున్న మదర్సాను బుల్డోజర్ తో కూల్చేసిన అధికారులు

ఇస్లామిక్ ఉగ్రవాద సంస్థ ఆల్ ఖైదాతో సంబంధాలున్నాయని అసోంలోని ఓ మదర్సాను బుల్డోజరుతో కూల్చేశారు. బార్ పేట జిల్లా ధకలియాపరాలో వున్న మదర్సాకు అల్ ఖైదాకు చెందిన అన్సరుల్లా బంగ్లాటీమ్ తో సంబంధాలున్నాయని ఆ మదర్సాను బుల్డోజర్ తో కూల్చేశారు. మదరసా దేశ వ్యతిరేక కార్యకలాపాలు, జిహాదీ సంస్థల కార్యకలాపాల్లో పాలుపంచుకోవడంతోపాటు ప్రభుత్వ భూమిలో ఉన్నందున దాన్ని కూల్చామని స్పష్టం చేశారు. ఇక దీనిపై అసోం సీఎం హిమంత విశ్వశర్మ స్పందించారు. ఈ మదర్సా ఉగ్రవాదుల హబ్ గా తయారైందని, అందుకే కూల్చేశామని తేల్చి చెప్పారు. కొన్ని రోజుల క్రిందటే అసోం సీఎం హిమంత కీలక ప్రకటన చేశారు. ఎవరైనా కొత్త ఇమామ్ లు రాష్ట్రంలోకి ప్రవేశిస్తే.. స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించిన విషయం తెలిసిందే. మరోవైపు ఉగ్రవాదులతో లింకులున్నాయని అక్బర్ అలీ, అబుల్ కలాం ఆజాద్ అనే ముస్లింలను కూడా అరెస్ట్ చేశారు పోలీసులు.

Related Posts

Latest News Updates