Prapancha Telugu

Latest Telugu News & information portal for Indians & NRI’s  

For more information contact :  info@prapanchatelugu.com

సిసోడియా బ్యాంక్ లాకర్లను తనిఖీ చేసిన సీబీఐ… ఏమీ దొరకలేదన్న సిసోడియా

ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా బ్యాంక్ లాకర్లను సీబీఐ అధికారులు ఓపెన్ చేశారు. ఘజియాబాద్ లోని పంజాబ్ నేషనల్ బ్యాంకులో సిసోడియా లాకర్ వుంది. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ విచారణలో భాగంగానే లాకర్లను సీబీఐ ఓపెన్ చేసి, తనిఖీలు చేసింది. ఆగస్టు 19 న లిక్కర్ పాలసీ అవినీతిలో సీబీఐ అధికారులు సిసోడియా ఇంట్లో తనిఖీలు నిర్వహించిన విషయం తెలిసిందే. సీబీఐ విచారణకు తాను పూర్తిగా సహకరిస్తానని హామీ ఇచ్చారు. అయితే సీబీఐ సోదాల్లో తన ఇంట్లో, బ్యాంక్ లాకర్‌లో ఏమి దొరకలేదని మనీష్ సిసోడియా తెలిపారు. లాకర్‌లో తన పిల్లలు, భార్యకు చెందిన 70వేల విలువైన ఆభరణాలు ఉన్నట్లు సిసోడియా చెప్పారు. ఏమీ దొరకదని తెలిసినా తనను జైల్లో పెట్టడానికి ప్రధాని మోడీ అధికారులపై ఒత్తిడి తెస్తున్నారని సిసోడియా ఆరోపించారు. సోదాల సమయంలో సీబీఐ అధికారులు ఎటువంటి ఇబ్బందులు పెట్టలేదని చెప్పారు.

Related Posts

Latest News Updates