Prapancha Telugu

Latest Telugu News & information portal for Indians & NRI’s  

For more information contact :  info@prapanchatelugu.com

ఆర్జేడీ నేతల ఇళ్లపై సీబీఐ దాడులు… మండిపడ్డ ఆర్జేడీ

సరిగ్గా…బిహార్ ఘట్ బంధన్ విశ్వాస పరీక్షకు ముందే ఆర్జేడీకి ఝలక్ తగిలింది. ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కు అత్యంత సన్నిహితుడు, పార్టీ ఎమ్మెల్సీ, కోశాధికారి సునీల్ సింగ్ నివాసంపై సీబీఐ దాడులు నిర్వహించింది. యూపీఏ హయాంలో రైల్వే మంత్రిగా వున్న లాలూ ప్రసాద్ యాదవ్ హయాంలో ల్యాండ్ ఫర్ జాబ్స్ అవకతవకల్లో దర్యాప్తులో భాగంగానే దాడులు చేస్తున్నామని సీబీఐ ప్రకటించింది. ఇక… ఆర్జేడీకి చెందిన మరో నేత, ఎంపీ అష్నాక్ కరీం ఇంటిపై కూడా సీబీఐ దాడులు చేసింది. మొత్తం ముగ్గురు నేతల ఇళ్లపై సోదాలు చేసింది. సునీల్ సింగ్, సుబోధ్ రాయ్, అహ్మద్ అష్పాక్ కరీం ఇళ్లపై సోదాలు చేసింది.

 

సీబీఐ దాడులపై సునీల్ సింగ్ స్పందించారు. కావాలని భయపెట్టి, ఎమ్మెల్యేలను తమవైపు తిప్పుకోడానికే ఇలా చేస్తున్నారని మండిపడ్డారు. ఇప్పటికే ఓ సారి తనిఖీలు చేశారని, మళ్లీ చేయడం ద్వారా భయం రేకెత్తించడానికే చేస్తున్నారని సునీల్ సింగ్ మండిపడ్డారు. ఐటీ, ఈడీ, సీబీఐ దాడులు బీజేపీ దాడులేనని, అవి బీజేపీ కిందే పనిచేస్తాయని ఆర్జేడీ ఘాటుగా విమర్శించింది.

Related Posts

Latest News Updates