Prapancha Telugu

Latest Telugu News & information portal for Indians & NRI’s  

For more information contact :  info@prapanchatelugu.com

తెలంగాణకు ఇచ్చిన నిధులివిగో…. చర్చకు సిద్ధమా? సూటిగా ప్రశ్నించిన కిషన్ రెడ్డి

కేంద్రం తెలంగాణకు ఇచ్చిన నిధులపై ముఖ్యమంత్రి కేసీఆర్ తో చర్చించేందుకు తాము సిద్ధంగా వున్నామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సవాల్ విసిరారు. రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం ఎంత మేర నిధులిచ్చిందో చర్చించడానికి తాము రెడీ అని ప్రకటించారు. హనుమకొండ వేదికగా బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సభలో కిషన్ రెడ్డి ప్రసంగించారు. హైదరాబాద్ నుంచి వరంగల్ కు వచ్చే రోడ్డుకు 2,295 కోట్లు, హైదరాబాద్, యాదాద్రి రోడ్డుకు 388 కోట్లు, యాదాద్రి నుంచి వరంగల్ రోడ్డుకు 1,907 కోట్లు ఇచ్చామని, అలాగే వరంగల్ బైపాస్ రోడ్డుకు 550 కోట్లు, హైదరాబాద్ నుంచి వరంగల్ బైపాస్ రోడ్డుకు 2,300 కోట్లు ఖర్చు పెట్టామని కిషన్ రెడ్డి వివరించారు. ఇక… కరీంనగర్ నుంచి వరంగల్ నాలుగు లేన్ల రోడ్డుకు 4321 కోట్లు, వరంగల్ నుంచి మంచిర్యాల రోడ్డుకు 4,317 కోట్లు, వరంగల్ నుంచి ఖమ్మం నాలుగు లేన్ల రోడ్డుకు 3,364 కోట్లు కేటాయించామని సభలో వివరించారు. వీటన్నింటిపై ముఖ్యమంత్రి కేసీఆర్ తో చర్చించడానికి తాము రెడీ అని, టీఆర్ఎస్ వాళ్లు రెడీయా? అంటూ కిషన్ రెడ్డి ప్రశ్నించారు.

 

నరేంద్ర మోదీ హయాంలోనే రామప్ప దేవాలయానికి యునెస్కో గుర్తింపు దక్కిందని కిషన్ రెడ్డి గుర్తు చేశారు. ఆలయ అభివ్రుద్ధికి 60 వేల కోట్లను ఖర్చు చేయబోతున్నామని కేంద్రమంత్రి వెల్లడించారు. అలాగే వేయి స్తంభాల గుడి అభివృద్ధికి చర్యలు తీసుకుంటామని, డిసెంబర్ లోపు వేయి స్తంభాల కళా మండపాన్ని పునరుద్ధరిస్తామని సభ నుంచి హామీ ఇచ్చారు. గిరిజన యూనివర్శిటీ విషయంలో టీఆర్ఎస్ సర్కారే కాలయాపన చేస్తోందని మండిపడ్డారు. వరంగల్ కు కేసీఆర్ ప్రభుత్వం ఏం చేసిందో చెప్పాలని కిషన్ రెడ్డి సవాల్ విసిరారు.

Related Posts

Latest News Updates