Prapancha Telugu

Latest Telugu News & information portal for Indians & NRI’s  

For more information contact :  info@prapanchatelugu.com

మెడికల్ కాలేజీల విషయంలో కేంద్రమంత్రి మన్సుఖ్… వర్సెస్ కేటీఆర్… సోషల్ మీడియాలో వార్

సోషల్ మీడియా వేదికగా కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవ్య, తెలంగాణ మంత్రి కేటీఆర్ విమర్శలు చేసుకున్నారు. తెలంగాణకు వైద్య కళాశాలల మంజూరు అంశంపై ఇరువురు నేతలు విమర్శలు చేసుకున్నారు. తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం ఒక్క వైద్య కళాశాల కూడా ఇవ్వలేదని కేటీఆర్ విమర్శించారు. దీంతో కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవ్య రిప్లై ఇస్తూ… తెలంగాణ ప్రభుత్వం నుంచి వైద్య కళాశాలల ఏర్పాటుకు ఎన్ని ప్రతిపాదనలు వచ్చాయి? ఒక్క ప్రతిపాదన కూడా రాలేదు. స్వల్ప కాలంలోనే మోదీ అత్యధిక సంఖ్యలో వైద్య కళాశాలలు మంజూరు చేశారు.

 

ఇందులో ఏ రాష్ట్రం పట్లా తాము వివక్ష ను చూపడం లేదని మస్సుఖ్ మాండవ్య ట్విట్టర్ వేదికగా స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్ `16 కొత్త మెడికల్ కాలేజీలను మంజూరు చేశారని, మరో 13 పరిశీలనలో వున్నాయన్నారు. ప్రధాని మోదీ జీ తెలంగాణకు ఎన్ని మెడికల్ కాలేజీలు మంజూరు చేశారో మీకు చెబుతున్నా… సున్నా అంటూ కేటీఆర్ వ్యంగ్యంగా ట్వీట్ చేశారు. దీనికి కేంద్ర మంత్రి మాండవ్య కూడా అంతే ఘాటుగా రిప్లై ఇచ్చారు. ఇప్పటి వరకూ తెలంగాణ ప్రభుత్వం మెడికల్ కాలేజీల కోసం ఎన్ని ప్రతిపాదనలు పంపింది? 0 (సున్నా) అంటూ మాండవ్య కూడా అంతే ఘాటుగా రిప్లై ఇచ్చారు.

 

Related Posts

Latest News Updates