Prapancha Telugu

Latest Telugu News & information portal for Indians & NRI’s  

For more information contact :  info@prapanchatelugu.com

తాజ్‌ బంజారాలో 12 లక్షల బిల్లు ఎగ్గొట్టిన వైజాగ్‌ డెవలపర్‌

హైదరాబాద్‌లోని తాజ్‌ బంజారా హోటల్‌ బిల్లుకు ఎగనామం పెట్టాడు విశాఖపట్నానికి చెందిన ఓ డెవలపర్‌. తాజ్‌బంజారా హోటల్‌లో 102 నైట్స్‌ స్టే చేసిన వైజాగ్‌కు చెందిన అక్కిచెట్టి శంకర్‌ నారాయన్‌.. మొత్తం బిల్లు రూ.25.96 లక్షలు కాగా రూ.13.62 లక్షలు మాత్రమే కట్టాడని, మిగిలిన రూ.12.34 లక్షల బిల్లును ఎగ్గొట్టాడని బంజారాహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదైంది.
102 రోజుల వసతి..
తాను హోటల్‌లో ఎక్కువ రోజుల ఉంటానని, స్పెషల్‌ ప్యాకేజీ కింద రేటు తక్కువకు ఇవ్వాలని కోరుతూ నారాయణ్‌ హోటల్‌ను సంప్రదించాడు. దీనికి హోటల్‌ యాజమాన్యం అంగీకరించి రూమ్‌ నంబర్‌ 405ని కేటాయించింది. ఏప్రిల్‌ 4న హోటల్‌లోకి దిగిన నారాయణ్‌.. వివిధ తేదీల్లో మొత్తం 102 నైట్స్‌ హోటల్‌లో ఉన్నాడు. ఈ ఏడాది ఏప్రిల్‌ 15న ఎవరికి చెప్పకుండా, చెప్పాచేయకుండా హోటల్‌ నుంచి వెళ్లిపోయాడని తాజ్‌ బంజారా జనరల్‌ మేనేజర్‌ హితేంద్ర శర్మ తెలిపారు. శంకర్‌ నారాయన్‌ హోటల్‌ను చీటింగ్‌ చేశారని బంజారాహిల్స్‌ పోలీస్‌ స్టేషనల్‌లో ఆగస్టు 6న సెక్షన్‌ 420, సెక్షన్‌ 406 కింద కేసు నమోదు చేశారు.

Related Posts

Latest News Updates