Prapancha Telugu

Latest Telugu News & information portal for Indians & NRI’s  

For more information contact :  info@prapanchatelugu.com

అభిమానికి అండగా మెగాస్టార్…

ఇటీవలే సీనియర్ నటుడు కైకాల పుట్టిన రోజు సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి వారింటికి వెళ్లి, ఆయనతో కేక్ కట్ చేయించారు. దీంతో ఆయన తన పెద్ద మనసును చాటుకున్నారు. తాజాగా… మెగాస్టార్ చిరంజీవి… ఆయన వీరాభిమాని అనారోగ్యానికి గురయ్యారన్న సమాచారం తెలుసుకొని, ఆస్పత్రికి వెళ్లి, ఆ అభిమానిని పరామర్శించారు. కుటుంబసభ్యులు, వైద్యులతో మాట్లాడి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గంలో నివాసం ఉండే దొండపాటి చక్రధర్… మెగాస్టార్ కు వీరాభిమాని.

 

తన అభిమాన హీరో బాటలోనే సమాజ సేవలో మునిగిపోయారు. పేదలకు చేసిన సేవలు అన్నీ ఇన్నీ కావు. ఎవరు ఆపదలో ఉన్నా వెంటనే స్పందించి ఎన్నో కుటుంబాలను, మెగాభిమానుల తరపున ఆదుకున్నారు. కానీ.. ఆయనకు క్యాన్సర్ వ్యాధి సోకింది. గత కొన్నాళ్ల నుంచి దొండపాటి చక్రధర్ అనారోగ్యంతో ఉన్నారు. ఈ విషయం మెగాస్టార్ చిరంజీవి గారికి తెలియగానే మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ కు రప్పించారు. ఒమేగా హాస్పిటల్ లో జాయిన్ చేయించారు. ఆ ఆసుపత్రికి సోమవారం సాయంత్రం వెళ్లి పరామర్శించి ధైర్యం చెప్పారు.

Related Posts

Latest News Updates