Prapancha Telugu

Latest Telugu News & information portal for Indians & NRI’s  

For more information contact :  teluguabroad.com@gmail.com 

న్యాక్‌ నుంచి సివిల్‌ ఇంజినీరింగ్‌లో కొత్త కోర్సులు

వృత్తి విద్య కోర్సుల్లో వినూత్న పద్ధతులు పాటిస్తూ దేశంలోనే ఉత్తమ సంస్థగా గుర్తింపు పొందిన తెలంగాణ నేషనల్‌ అకాడమీ ఆఫ్‌ కన్‌స్ట్రక్షన్‌ (న్యాక్‌) మరో కొత్త కోర్సుకు శ్రీకారం చుడుతోంది. కన్‌స్ట్రక్షన్‌ ప్రాజెక్ట్‌ మేనేజ్‌మెంట్, క్వాంటిటీ సర్వేయింగ్‌ అండ్‌ కాంట్రాక్ట్‌ మేనేజ్‌మెంట్‌ కోర్సులను ప్రారంభిస్తోంది. భవన నిర్మాణంలో అవసరమైన అన్ని పనులు చేయగలిగే సామర్థ్యం కల్పిస్తూ ఇప్పటికే వేల మంది నిపుణులను రూపొందించిన న్యాక్‌… ఇంజినీర్లు లక్ష్యంగా కోర్సులను కూడా నిర్వహిస్తోంది.
కోర్స్‌ ప్రత్యేకతలేంటంటే..
సైట్‌ ఇంజినీర్లుగా పనిచేసే వారికి నిర్మాణ రంగానికి సంబంధించిన పూర్తి అవగాహన, సామర్థ్యం ఉండేందుకు మరిన్ని కోర్సులు ప్రారంభించాలని గతంలోనే నిర్ణయించింది. ఇందులో భాగంగా ఈ కోర్సులు ప్రారంభించింది. ఓ నిర్మాణ ప్రాజెక్టును ప్రారంభించేప్పుడు దాని ప్లానింగ్‌ ఎలా ఉండాలో సమగ్ర అవగాహన కల్పించేదే కన్‌స్ట్రక్షన్‌ ప్రాజెక్టు మేనేజ్‌మెంట్‌ కోర్స్‌. ఇక కాంట్రాక్టు, ప్రైస్‌ ఎస్కలేషన్, భూమి విలువ నిర్ధారణ, నిర్మాణానికి వాడే యంత్రాలపై అవగాహన, బీఓటీ కాన్సెప్ట్, మెజర్‌మెంట్, కన్‌స్ట్రక్షన్‌ సాఫ్ట్‌వేర్‌… ఇలా అన్ని రంగాల్లో అవగాహన కల్పించేది రెండో కోర్స్‌.
అర్హులు ఎవరంటే..
బీటెక్‌ సివిల్‌ఇంజినీరింగ్‌ పూర్తయినవారు ఈ పీజీ డిప్లొమా కోర్సులు చేసేందుకు అర్హులు. రెండు కోర్సులకు 60 చొప్పున సీట్లు ఖరారు చేసినట్టు న్యాక్‌ డైరక్టర్‌ జనరల్‌ బిక్షపతి పేర్కొన్నారు. జేఎన్‌టీయూ గుర్తింపుతో ఈ కోర్సులు నిర్వహిస్తున్నామని, కోర్సు పూర్తయిన తర్వాత జేఎన్‌టీయూ గుర్తింపు సర్టిఫికెట్లు ప్రదానం చేయనున్నట్టు ఆయన వెల్లడించారు. జేఎన్‌టీయూ ప్రొఫెసర్ల ఆధ్వర్యంలోనే కోర్సులు నిర్వహిస్తామని చెప్పారు.

Related Posts

Latest News Updates