ఏపీ ముఖ్యమంత్రి నేడు తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో విద్యాశాఖపై సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి విద్యాశాఖా మంత్రి బొత్స సత్యనారాయణతో పాటు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన అధికారులకు పలు సూచనలు చేశారు. పాఠశాలల సదుపాయాలు, రిపేర్లు చూసుకునేందుకు ప్రత్యేకంగా ఓ అధికారిని నియమించాలని ఆదేశించారు. ఏ రిపేర్లు వచ్చినా, ఇతర ఇబ్బందులు వచ్చినా… ఆ అధికారి చూసుకునేలా ఓ పద్ధతి వుండాలని ఆకాంక్షించారు. ఇక… వచ్చే యేడాది విద్యా కానుక కింద అందించే వస్తువులను ఏప్రిల్ చివరి నాటికే సిద్ధం చేయాలని సూచించారు. విద్యార్థులకు ట్యాబ్ లు ఇచ్చేలా వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. దశల వారీగా డిజిటల్ స్క్రీన్లను ఏర్పాటు చేసి, విద్యా బోధనను సులువు చేయాలని సీఎం జగన్ సూచించారు.
