Prapancha Telugu

Latest Telugu News & information portal for Indians & NRI’s  

For more information contact :  info@prapanchatelugu.com

గల్వాన్ లోయలో అమరులైన వీర సైనికుల త్యాగం ఎంతో గొప్పది : సీఎం కేసీఆర్

ముఖ్యమంత్రి కేసీఆర్ బిహార్ పర్యటనకు వెళ్లారు. అక్కడి విమానాశ్రయంలో సీఎం కేసీఆర్ కు బిహార్ సీఎం నితీశ్ కుమార్, డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్ ఘనంగా స్వాగతం పలికారు. ఆ తర్వాత గల్వాన్ అమరవీరుల కుటుంబాలకు ఆర్థిక సాయంగా సీఎం నితీశ్ తో కలిసి 10 లక్షల చొప్పున చెక్కులు అందజేశారు. అమరవీరుల కుటుంబాలకు ఆర్థిక సాయం చేయడం సమాజం బాధ్యత అని అన్నారు. అమరులకు కేంద్రమే కాకుండా… రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అండగా వుండాలని సూచించారు. గాల్వాన్‌లో వీరజవాన్ల త్యాగం ఎంతో గొప్పదని, దేశం కోసం జవాన్లు ప్రాణ త్యాగం చేశారని కేసీఆర్ అన్నారు.

 

అంతేకాకుండా తెలంగాణలో ప్రమాదంలో చనిపోయిన 12 మంది బిహార్ వలస కూలీల కుటుంబాలకు కూడా రూ.5 లక్షల చొప్పున ఆర్థికసాయం అందజేశారు. గల్వాన్ వద్ద చైనా సైనికులతో జరిగిన ఘర్షణల్లో వీర మరణం పొందిన భారత సైనికులు సునీల్ కుమార్, కుందన్ కుమార్, అమన్ కుమార్, చందన్ కుమార్, జయ్ కిషోర్ కుటుంబాలకుఒక్కో కుటుంబానికి రూ. 10 లక్షల ఆర్ధిక సాయాన్ని చెక్కుల రూపంలో సీఎం కే చంద్రశేఖర్‌రావు అందించారు. అదేవిధంగా హైదరాబాదులో జరిగిన అగ్నిప్రమాదంలో మరణించిన సికిందర్ రామ్, దినేశ్ కుమార్, బిట్టూ కుమార్, దీపక్ రామ్, సత్యేంద్ర కుమార్ తదితర కుటుంబాలకు సీఎం కేసీఆర్ ఆర్థిక సాయం అందజేశారు.

 

 

దేశ రక్షణ కోసం పోరాడుతూ గల్వాన్ లోయలో అమరులైన వీర సైనికుల త్యాగం ఎంతో గొప్పదని శ్లాఘించారు. వీర సైనిక కుటుంబాలకు అండగా ఉంటామని చెప్పేందుకే ఇక్కడి వచ్చామని వెల్లడించారు. అమరవీరుల కుటుంబాలకు ఆర్థిక సాయం చేయడం మన బాధ్యత అని చెప్పారు. అమరులైన సైనికుల కుటుంబాలకు సహాయం చేయాలని ఎంతో కాలంగా హృదయం భారంగా ఉండేదని, అందుకే ఈ పవిత్ర భూమికి చెందిన అమరులైన సైనికుల కుటుంబాలకు మా వంతు సహాయం చేస్తున్నామని చెప్పారు. కోల్పోయిన ప్రాణాలను తిరిగి తీసుకురాలేం, కానీ అమరులైన సైనికుల కుటుంబాలకు యావత్ దేశం అండగా ఉండాలనే సందేశం అందరికీ చేరాలని పేర్కొన్నారు. ఇలాంటి కార్యక్రమాలతో సైనికులకు, దేశ రక్షణ దళాలకు ఆత్మస్థైర్యం పెరుగుతుందన్నారు.

Related Posts

Latest News Updates