మహబూబ్ నగర్లో ముఖ్యమంత్రి కెసిఆర్ పర్యటించారు. పాలమూరు జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో ఏర్పాటు చేసిన టీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించారు. నూతన పార్టీ కార్యాలయంతో కెసిఆర్ టిఆర్ఎస్ జెండా ఎగురవేశారు. టిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో సిఎం కెసిఆర్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి శ్రీనివాస్ గౌడ్‌తో పాటు ఉమ్మడి మహబూబ్‌నగర్‌కు చెందిన పలువురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర నాయకులు పాల్గొన్నారు. టీఆర్ఎస్ శ్రేణులు జై తెలంగాణ నినాదాలు చేశారు.
