Prapancha Telugu

Latest Telugu News & information portal for Indians & NRI’s  

For more information contact :  info@prapanchatelugu.com

వాట్ నెక్ట్స్? విద్యుత్ శాఖ అధికారులతో సీఎం కేసీఆర్ కీలక సమావేశం

విద్యుత్‌ శాఖ అధికారులతో తెలంగాణ సీఎం కేసీఆర్‌ సమావేశమయ్యారు. ఏపీ ప్రభుత్వానికి చెల్లించాల్సిన విద్యుత్‌ బకాయిలపై కేంద్ర ఇచ్చిన ఆదేశాలు, ఏపీ నుంచి రావాల్సిన బిల్లులపై సీఎం కేసీఆర్‌ సమీక్ష నిర్వహిస్తున్నారు. కేంద్రం ఆదేశాలపై ఏం చేయాలి? ఎలాంటి చర్యలు తీసుకోవాలి? ఏపీ నుంచి రావాల్సిన బకాయిలపై కేంద్రానికి లేఖ రాయాలా? ఏం చేయాలి? అనేదానిపై సీఎం కేసీఆర్‌ రివ్యూ చేస్తున్నారు. ఈ సమీక్ష తర్వాత కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు.

 

ఏపీ విద్యుత్ డిస్కమ్ లకు చెల్లి్ంచాల్సిన 6,756.92 కోట్లను నెల రోజుల్లోనే చెల్లించాలని తెలంగాణ డిస్కమ్ లకు కేంద్రం ఆదేశించింది. రాష్ట్ర విభజన చట్టం సెక్షన్ 92 ప్రకారం.. తెలంగాణకు ఏపీ సరఫరా చేసిన విద్యుత్ కు గాను అసలు 3,441.78 కోట్లు, వడ్డీ 3,315.14 కోట్లు కలిపి మొత్తం 6,756.92 కోట్లను నెలలో చెల్లించాలని కేంద్రం ఆదేశించింది. ఇటీవల ఏపీ సీఎం జగన్ ఢిల్లీకి వెళ్లి, ప్రధాని మోదీతో భేటీ అయిన సందర్భంలో తెలంగాణ నుంచి రావాల్సిన విద్యుత్ బకాయిలపై క్లారిటీ ఇవ్వాలని సీఎం జగన్ ప్రధాని మోదీని కోరారు. ఈ సమావేశం తర్వాతే ఈ కదలిక వచ్చింది.

Related Posts

Latest News Updates