Prapancha Telugu

Latest Telugu News & information portal for Indians & NRI’s  

For more information contact :  info@prapanchatelugu.com

ప్రభుత్వాలను అస్థిరపరుస్తున్నారు… ఇప్పుడు ఢిల్లీపై కన్ను పడింది : కేజ్రీవాల్ గరం గరం

ఢిల్లీ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాల సందర్భంగా ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కేంద్ర ప్రభుత్వంపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. అన్ని ప్రభుత్వాలను వరుసగా నరేంద్ర మోదీ ప్రభుత్వం హత్య చేస్తోందంటూ కేజ్రీవాల్ తీవ్రంగా ఆరోపించారు. దేశంలోని పలు ప్రభుత్వాలను మోదీ ప్రభుత్వం అస్థిరపరిచిందని, ఇప్పుడు మోదీ ప్రభుత్వం కన్ను ఢిల్లీ ప్రభుత్వంపై పడిందని ఆయన ఆరోపించారు. ఈ మధ్య రోజుల్లోనే బీజేపీ ఏకంగా 277 మంది ఎమ్మెల్యేలను కొనుగోలు చేసిందన్నారు. ఇంత మంది ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి బీజేపీ డబ్బు ఎక్కడినుంచి వచ్చిందని సూటిగా ప్రశ్నించారు. జీఎస్టీ వసూళ్లను భారీగా చేసి, వాటిని ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి వాడుతున్నారని కేజ్రీవాల్ ఆరోపించారు. మద్యం అవకతవకలు జరిగాయంటూ డిప్యూటీ సీఎం మనీశ్ నివాసంపై సీబీఐ దాడులు చేసిందని, ఏమీ కనుక్కోలేక పోయిందన్నారు. అవన్నీ తప్పుడు సోదాలని, డబ్బులు కానీ, డాక్యుమెంట్లు గానీ, నగలను కానీ సీబీఐ స్వాధీనం చేసుకోలేదని కేజ్రీవాల్ పేర్కొన్నారు.

 

ఎక్సైజ్ పాలసీ కేసులో సీబీఐ అధికారులు గంటల పాటు తనింట్లో సోదాలు జరిపినట్లు.. తన బట్టలతో పాటు పిల్లల బట్టలను కూడా తనిఖీలు చేశారని ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా వెల్లడించారు. సోదాల్లో ఏవీ కనిపించలేదని తెలిపారు.రాష్ట్ర ప్రభుత్వాలను కూల్చడానికి బీజేపీ సీరియల్ కిల్లర్ గా వ్యవహరిస్తోందని ఆరోపించారు. ఇంకా 1000 దాడులు చేసుకోండి.. కానీ.. ఏమీ కనుగోలేరని చెప్పారు. విద్యను ముందుకు తీసుకెళ్లే దిశగా పని చేయడం జరుగుతోందని, చేసిన మంచి పనిని ప్రపంచం మెచ్చుకోవడాన్ని వారు జీర్ణించుకోలేకపోతున్నారని విమర్శించారు.

Related Posts

Latest News Updates