తాను ప్రధాని రేసులో లేనని బిహార్ సీఎం నితీశ్ కుమార్ స్పష్టం చేశారు. తనకు అలాంటి ఆలోచన కూడా లేదని స్పష్టం చేశారు. ఈ విషయాన్ని ఇంతటితో వదిలేయాలని, అందరి కోసం పనిచేయడమే తన పని అని, విపక్షాలన్నింటినీ ఏకతాటిపైకి తీసుకురావడానికి పనిచేస్తానని పేర్కొన్నారు. ఈ నెల 15 తర్వాత కేబినెట్ విస్తరణ జరుగుతుందని, ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు ప్రయత్నిస్తామని సీఎం నితీశ్ పేర్కొన్నారు. ప్రధాని రేసులో నితీశ్ ఉన్నారని, అందుకు దగ్గ ఏర్పాట్లు చేసుకుంటున్నారని వార్తలు వచ్చిన నేపథ్యంలో ఆయన స్పందించారు. ఇక… ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ ఉద్యోగాల విషయంలో ఇచ్చిన హామీపై కూడా నితీశ్ ఆచితూచి స్పందించారు. 10 లక్షల ఉద్యోగాల హామీపై తామందరమూ చర్చిస్తున్నామని, దానిని ఆచరణలో పెట్టడానికి ప్రయత్నాలు చేస్తామని సీఎం నితీశ్ అన్నారు.
కొన్ని రోజుల క్రిందటే బీజేపీతో సీఎం నితీశ్ తెగదెంపులు చేసుకున్నారు. ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. ఆ తర్వాత ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఉప ముఖ్యమంత్రిగా తేజస్వీ యాదవ్ ప్రమాణ స్వీకారం చేశారు. కాంగ్రెస్, ఆర్జేడీ, వామపక్సాలతో కలిసి నితీశ్ కొత్త కూటమిని ఏర్పాటు చేశారు. అంతేకాకుండా కాంగ్రెస్ అధినేత్రి సోనియాకు కూడా ఫోన్ చేశారు. దీంతో ప్రతిపక్షాలను కూడగట్టే పనిలో నితీశ్ నిమగ్నమయ్యారని, ఆ పనిని స్వయంగా సోనియానే పురమాయించారని కూడా వార్తలు వచ్చాయి.
@NitishKumar ने साफ़ किया कि पीएम पद के लिए किसी रेस में नहीं लेकिन क्या चाहते हैं उसका खुलासा किया @ndtvindia @Suparna_Singh pic.twitter.com/2n6gnbERD6
— manish (@manishndtv) August 12, 2022