Prapancha Telugu

Latest Telugu News & information portal for Indians & NRI’s  

For more information contact :  info@prapanchatelugu.com

విశ్వాస పరీక్షలో నెగ్గిన సీఎం నితీశ్… 2024 లో తానెంటో చూపిస్తానంటూ శపథం

బిహార్ లో సీఎం నితీశ్ ఆధ్వర్యంలో ఏర్పడిన మహా ఘట బంధన్ సర్కార్ బలపరీక్షలో మూజువాణి ఓటుతో గెలుపొందింది. ఈ ఓటింగ్ లో సీఎం నితీశ్ కు 160 ఓట్లు వచ్చాయి. అసెంబ్లీలో మొత్తం 243 స్థానాలుండగా… నితీశ్ సర్కార్ కు 164 ఓట్లు వచ్చాయి. పార్టీలన్నీ కలిసి వచ్చి తనకు మద్దతిచ్చినందుకు నితీశ్ ధన్యవాదాలు ప్రకటించారు. అయితే.. విశ్వాస పరీక్ష సందర్భంగా బీజేపీ సభ నుంచి వాకౌట్ చేసింది. విశ్వాస పరీక్ష నెగ్గిన తర్వాత సీఎం నితీశ్ బీజేపీపై విమర్శలు చేశారు. 2024 లో తానేంటో చూపిస్తానని ఛాలెంజ్ విసిరారు. తనను వాజ్ పేయి, అద్వానీ లాంటి వారు ఎంతో గౌరవించారని, కానీ బీజేపీలో ఇప్పుడు అలా లేదని చెప్పుకొచ్చారు.

 

మార్పు కోసం అందరూ పనిచేయాలని సీఎం నితీశ్ అన్నారు. బిహార్ డెవలప్ మెంట్ కోసం తాము, ఆర్జేడీ కలిసి పనిచేస్తామని ప్రతిజ్ఞ తీసుకున్నామని పేర్కొన్నారు. ఆర్జేడీ, కాంగ్రెస్ తో కలిసి పనిచేయాలన్న నిర్ణయం తీసుకున్న సమయంలో జాతీయ నేతలందరూ తనను అభినందించారని పేర్కొన్నారు. 2024 సార్వత్రిక ఎన్నికల కోసం అందరమూ కలిసి పనిచేయాలని వారికి తాను సూచించినట్లు నితీశ్ వెల్లడించారు.

 

పాట్నా యూనివర్శిటీకి జాతీయ హోదా కావాలంటూ తాను 2017 లోనే డిమాండ్ చేశానని అయినా ఎవ్వరూ పట్టించుకోలేదన్నారు. కానీ.. ఇప్పుడు ఇదే అంశంపై బీజేపీ వారు ప్రచారం చేసుకుంటున్నారని ఎద్దేవా చేశారు. మొన్నటి ఎన్నికల గురించే కాదని, గతంలో జరిగిన విషయాల గురించి కూడా బీజేపీ నేతలు మాట్లాడాలని చురకలంటించారు. వాజ్ పేయి, అద్వానీ యుగంలో తననెంతో గౌరవించేవారని, ఇప్పుడు అలాంటి పరిస్థితులు బీజేపీలో లేవని విమర్శించారు.

Related Posts

Latest News Updates