Prapancha Telugu

Latest Telugu News & information portal for Indians & NRI’s  

For more information contact :  teluguabroad.com@gmail.com 

బెంగళూరులో కోలివ్‌ లగ్జరీ ప్రాపర్టీ

ప్రాప్‌టెక్‌ కంపెనీ కోలివ్‌ బెంగళూరులో లగ్జరీ కో–లివింగ్‌ ప్రాపర్టీని ప్రారంభించింది. బెంగళూరు ఔటర్‌ రింగ్‌ రోడ్డులోని దుడ్డనెకొండిలో కోలివ్‌ సిగ్నేచర్‌ టవర్‌ను లాంచింగ్‌ చేసినట్లు కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. అమెజాన్, సామ్‌సంగ్, గూగుల్, విసా వంటి ప్రముఖ కంపెనీలకు అతి సమీపంలో ఈ ప్రాపర్టీ ఉందని పేర్కొంది. ఇందులో 140 డబుల్‌ షేరింగ్‌ గదులు, 280 బెడ్స్‌ ఉన్నాయి. ఫుల్లీ ఫర్నీషింగ్, కాంటెంపరరీ ఇంటీరియర్స్‌తో లగ్జరీ ప్రాపర్టీలను తలదన్నే రీతిలో సిగ్నేచర్‌ టవర్‌ను తీర్చిదిద్దామని కోలివ్‌ ఫౌండర్‌ అండ్‌ సీఈఓ సురేష్‌ రంగరాజన్‌ తెలిపారు. 2016లో ప్రారంభమైన కోలివ్‌ సేవలు.. ప్రస్తుతం బెంగళూరు, హైదరాబాద్, చెన్నైలో పలు ప్రాపర్టీలను నిర్వహిస్తుంది. వచ్చే రెండేళ్లలో 75 వేల బెడ్స్‌కు చేరుకోవాలన్నది కంపెనీ లక్ష్యం.

Related Posts

Latest News Updates