నేషనల్ హెరాల్డ్ మనీ లాండరింగ్ కేసులో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీని ఈడీ ప్రశ్నించింది. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకూ ఈడీ ఆమెను ప్రశ్నించింది. మధ్యాహ్నం లంచ్ కోసం సోనియా నివాసానికి వెళ్లారు. లంచ్ ముగిసిన తర్వాత మళ్లీ ఈడీ విచారణ కొనసాగింది. ఈ సందర్భంగా సోనియా గాంధీ స్టేట్ మెంట్ ను ఈడీ రికార్డు చేసింది. నేషనల్ హెరాల్డ్ పత్రిక, యంగ్ ఇండియన్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీవ్యవహారాల్లో సోనియా పాత్రపై ఈడీ పలు ప్రశ్నలు వేసింది.
ఈ సంస్థల్లో రాహుల్ గాంధీ పాత్రను కూడా ఈడీ అధికారులు అడిగి తెలుసుకున్నారు. మరోవైపు ఉదయం 11 గంటలకు సోనియా గాంధీ ఎంపీ రాహుల్, ప్రియాకంతో కలిసి ఈడీ కార్యాలయానికి చేరుకున్నారు. రాహుల్ గాంధీ అక్కడి నుంచి వెళ్లిపోయారు. ప్రియాంక మాత్రం ఈడీ కార్యాలయంలోనే వుండిపోయింది.