Prapancha Telugu

Latest Telugu News & information portal for Indians & NRI’s  

For more information contact :  info@prapanchatelugu.com

పార్టీని ఎవ్వరూ వీడొద్దు… రాహుల్ వస్తున్నారు : పల్లంరాజు

చాలా రోజుల తర్వాత కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత పల్లంరాజు మీడియా ముందుకు వచ్చారు. పార్టీ ప్రస్తుతం కష్టకాలంలో వుందన్నారు. ఇలాంటి సమయంలో పార్టీని ఎవరూ వీడొద్దని కోరారు. పల్లంరాజు తిరుమల శ్రీవారిని దర్శించుకున్న తర్వాత మీడియాతో మాట్లాడారు. సీనియర్ నేత గులాంనబీ ఆజాద్ పార్టీని వీడటం చాలా దురద్రుష్టకరమని అన్నారు. అయితే.. పార్టీ ప్రస్తుతం కష్టకాలంలో వుందని, అందుకే రాహుల్ భారత్ జోడో యాత్ర చేస్తున్నారని, అందరూ పార్టీని అంటిపెట్టుకొనే వుండాలని కోరారు. బీజేపీ యేతర ప్రభుత్వాలను మోదీ ప్రభుత్వం కూల్చేస్తూ.. అప్రజాస్వామికంగా చేస్తున్నారని మండిపడ్డారు. జార్ఖండ్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. మునుగోడు ఉప ఎన్నికల్లో కాంగ్రెస్సే గెలుస్తుందని పల్లంరాజు ధీమా వ్యక్తం చేశారు.

Related Posts

Latest News Updates