బీజేపీ సారథ్యంలోని ఎన్డీయే పదానికి కాంగ్రెస్ ఎంపీ కొత్త నిర్వచనం చెబుతూ ట్వీట్ చేశారు. బీజేపీ ప్రభుత్వం వద్ద డేటాయే కాదు.. జవాబుదారీ తనం కూడా లేదంటూ రాహుల్ ట్వీట్ చేశారు. వివిధ సందర్భాల్లో వివిధ ప్రశ్నలకు సంబంధించి, తమ వద్ద డేటా లేదని కేంద్రం ప్రకటించిన నేపథ్యంలో రాహుల్ పై విమర్శ చేశారు. ఎన్డీయే అంటే నో డేటా అవలేబుల్ (No data avaliable)అంటూ రాహుల్ ట్విట్టర్ వేదిగా ఎద్దేవా చేశారు.
ఆక్సీజన్ కొరత వల్ల ఒక్కరు కూడా చనిపోలేదు. నిరసనలు చేపట్టిన రైతుల్లో ఏ ఒక్కరూ ప్రాణాలు కోల్పోలేదు. కాలినడక వల్ల ఒక్క వలస కూలీ కూడా మరణించలేదు. మూక దాడుల వల్ల ఒక్కడూ మరణించలేదు. ఒక్క జర్నలిస్టును కూడా అరెస్టు చేయలేదు అని నో డేటా అవైలబుల్(ఎన్‌డీఏ) ప్రభుత్వం ప్రజల్ని నమ్మించాలనుకుంటుంది. వారి దగ్గర డేటా లేదు. సమాధానమూ లేదు. జవాబుదారీ అంతకంటే లేదు’ అని రాహుల్ శనివారం ట్వీట్ చేశారు.
‘No Data Available’ (NDA) govt wants you to believe:
• No one died of oxygen shortage
• No farmer died protesting
• No migrant died walking
• No one was mob lynched
• No journalist has been arrestedNo Data. No Answers. No Accountabilty. pic.twitter.com/mtbNkkBoXe
— Rahul Gandhi (@RahulGandhi) July 23, 2022