Prapancha Telugu

Latest Telugu News & information portal for Indians & NRI’s  

For more information contact :  info@prapanchatelugu.com

బహదూర్‌పుర ఎంఆర్‌వో ఆఫీస్‌కు బ్రేక్‌లు

బహదూర్‌పురా తహసీల్ధార్‌ కార్యాలయ నూతన భవన నిర్మాణ పనులు నిలిచిపోయాయి. రోడ్డు విస్తరణ కార్యక్రమంలో భాగంగా బహదూర్‌పురా తహసీల్ధార్‌ కార్యాలయాన్ని తొలగించేందుకు జీహెచ్‌ఎంసీ అధికారులు కోరడంతో అందుకు పక్కనే ఉన్న ఖాళీ స్థలంలో నూతన కార్యాలయ భవనాన్ని నిర్మించి ఇవ్వాలని కోరడంతో అందుకు అధికారులు నూతన భవన నిర్మాణ పనులకు ఆరు నెలలు క్రితం శ్రీకారం చుట్టారు. గుంతలు మాత్రమే తవ్వి వదిలేసిన కాంట్రాక్టర్‌ ఐదు నెలల అనంతరం తిరిగి పనులు ప్రారంభించారు. ప్రస్తుతం నెల రోజులుగా పనులు నిలిచిపోయాయి. ఈ విషయమై బహదూర్‌పురా తహసీల్ధార్, సంబంధిత కాంట్రాక్టర్‌కు వివరణ కోరినప్పటికీ.. ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయింది. ఈ విషయమై టౌన్‌ ప్లానింగ్, ఇంజనీరింగ్‌ విభాగాల వారికి ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు. వెంటనే మండల కార్యాలయ నూతన భవన నిర్మాణ పనులు చేపట్టాలని సిబ్బంది కోరుతున్నారు.

Related Posts

Latest News Updates