ఏపీలో కరోనా మళ్లీ పెరుగుతోంది. అధికార వైసీపీ ఎమ్మెల్యేలకు కోవిడ్ పాజిటివ్ అని తేలింది. మాజీ మంత్రి, ఎమ్మెల్యే మేకతోటి సుచరిత, ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణ రెడ్డికి కోవిడ్ సోకింది. ఈ ఇద్దరు నేతలు ప్రస్తుతం హోం ఐసోలేషన్ లోనే వున్నారు. చికిత్స తీసుకుంటున్నారు. తమను కలిసిన వారందరూ తప్పని సరిగా కోవిడ్ టెస్ట్ చేయించుకోవాలని ఇరువురు నేతలు సూచిస్తున్నారు. తమకు ఇబ్బందిగా అనిపించడంతో కోవిడ్ టెస్టులు చేయించుకున్నామని, అందులో తమకు పాజిటివ్ అని నిర్ధారణ అయ్యిందని పేర్కొన్నారు.
ఇక దేశ వ్యాప్తంగా మళ్లీ కోవిడ్ పెరుగుతోంది. రోజూ కొన్ని కొత్త కేసులు వస్తున్నాయి. అయితే మరణాల రేటు కొంచెం తక్కువగా వుంది. దీంతో అందరూ ఊపిరి పీల్చుకుంటున్నారు. అయితే… పాజిటివ్ కేసుల సంఖ్య బాగా పెరిగిపోతోంది. దీంతో ప్రజలందరూ అప్రమత్తంగానే వుండాలని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు సూచిస్తున్నాయి. మాస్కులు కచ్చితంగా ధరించాలని సూచిస్తున్నారు.