Prapancha Telugu

Latest Telugu News & information portal for Indians & NRI’s  

For more information contact :  info@prapanchatelugu.com

తెలంగాణలో విపరీతంగా పెరిగిపోయిన క్రైంరేట్

2021లో తెలంగాణలో క్రైం రేటు విపరీతంగా పెరిగింది. 2019తో పోలిస్తే భారీగా నమోదయ్యాయి. అంతేకాదు మహిళలపై దాడులు, చిన్నారులపై లైంగిక వేధింపులు సైతం భారీగా పెరిగాయి. సైబర్‌ నేరాల్లోనూ తెలంగాణ దేశంలోనే తొలిస్థానలో ఉందని జాతీయ నేర గణాంక సంస్థ వెల్లడించింది. ఈ మేరకు జాతీయ నేర గణాంక సంస్థ 2021 నివేదిక ప్రకటించింది. దీని ప్రకారం మానవ అక్రమ రవాణా, ఆహార కల్తీ కేసుల్లోనూ తెలంగాణ మళ్లీ టాప్‌గా నిలిచింది. ఇక రైతుల ఆత్మహత్యల్లో తెలంగాణ నాలుగో స్థానంలో ఉంది . హత్యలు, మహిళలపై దాడులు, అత్యాచారాలు, చిన్నారులపై లైంగిక దాడులు, కిడ్నాపులు, వృద్ధులపై దాడులు, సూసైడ్స్‌‌‌‌ పెరిగాయని ఎన్‌‌‌‌సీఆర్‌‌‌‌‌‌‌‌బీ వెల్లడించింది. గతేడాది 21,315 రోడ్డు ప్రమాదాలు జరగ్గా.. 7,447 మంది మృతి చెందారు. రోజూ 20 మంది చనిపోతున్నారు. రాష్ట్రంలో గతేడాది 10,171 మంది సూసైడ్​ చేసుకోగా అందులో కుటుంబ కలహాలు, అనారోగ్యంతో సూసైడ్‌‌‌‌ చేసుకున్న వారి సంఖ్య 4,464. ఇందులో 45 నుంచి-60 ఏండ్ల వారే ఎక్కువ‌‌‌‌గా ఉన్నారు.

Related Posts

Latest News Updates