Prapancha Telugu

Latest Telugu News & information portal for Indians & NRI’s  

For more information contact :  info@prapanchatelugu.com

తానా బాలోత్సవ్ లో ‘రూబిక్స్ క్యూబ్ సాల్వింగ్’ పోటీలు… విజేతలకు బహుమతులిచ్చిన తానా

తానా బాలోత్సవ్ లో భాగంగా 5 నుంచి 16 సంవత్సరాల పిల్లలకు రూబిక్స్ క్యూబ్ సాల్వింగ్ పోటీలను నిర్వహించారు. దాదాపు 100 మంది ఇందులో పాల్గొన్నారు. మొదటి రౌండ్ పోటీలు జూలై 30 నుంచి ఆగస్ట్ 8 వరు జరిగాయని, ఒక్కో కేటగిరీ నుంచి 20 మందిని సెలెక్ట్ చేసినట్లు నిర్వాహకులు పేర్కొన్నారు. ఇక… రెండో రౌండ్ ఆగస్ట్ 14 న జరిగింది. ఈ రౌండ్ లో ఒక్కో కేటగిరీ నుంచి 10 మందిని సెలెక్ట్ చేశారు. ఇక ఫైనల్ రౌండ్ ఆగస్టు 25 న జరిగింది. రెండు సెషన్స్ లో జరిగాయి. టాప్ 3 విన్న్రర్స్ కి ఆగస్టు 27 న బహుమతులు అందజేసినట్లు తానా బాలోత్సవ్ ప్రతినిధులు తెలిపారు. దీపిక సమ్మెట, శిరీష సమ్మెట, సౌజన్య పొట్టి, లక్ష్మి కందిమళ్ల, వెంకట్ సోమవరపు కు బాలోత్సవ్ కమిటీ ధన్యవాదాలు ప్రకటించింది. అలాగే బాలోత్సవ్ టీమ్ కు కూడా తానా ధన్యవాలు ప్రకటించింది.

Related Posts

Latest News Updates